తనపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ విధించడాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై సస్పెండ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారని..ఛార్జీ షీట్ లేదు.. ట్రయల్ లేదు.. అయినా తాను సాక్షులను ప్రభావితం చేయడమేంటని ప్రశ్నించారు. ఏమీ లేని దానికి తనను సస్పెండ్ చేస్తూ జీవో ఇచ్చారని.. తనను మళ్లీ సస్పెండ్ చేయాలనే సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో..? ఏ పనికి మాలిన సలహాదారు…
తన రూటే సెపరేటు అనే హీరో మోహన్ బాబు.. తాజాగా తిరుపతిలో అదే చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహారించారనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కోర్టు వాయిదాకు ఇద్దరు కుమారులతో కలిసి హాజరైన ఆయన.. కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు.. రకరకాల ఊహాగానాలకు తెరతీశాయి. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉంటూ.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు.. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు.…
ఆత్మకూరు ఉపఎన్నికలో లక్ష మెజారిటీ కోసం లక్ష పాట్లు పడ్డారు వైసీపీ నేతలు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేశారు. బై ఎలక్షన్లో గెలిచినా లక్ష్యాన్ని చేరుకోకపోవడమే అధికారపార్టీ శిబిరంలో చర్చగా మారింది. ఆ అంశంపైనే పోస్టుమార్టం చేస్తున్నారట. పార్టీ నేతల అనైక్యత వల్లే లక్ష మెజారిటీ రాలేదా? ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ బరిలో లేకపోవడం.. బీజేపీ మాత్రమే బరిలో ఉండటంతో.. సులభంగా లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఆశించారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా…
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల అసంతృప్త స్వరాలు పెరిగాయి. అంతకుముందు ఒకరో ఇద్దరూ ఆ విధంగా బయటపడినా.. పిలిచి మాట్లాడటమో.. వార్నింగ్ ఇవ్వడమో చేసేవారు పార్టీ పెద్దలు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల విషయంలో ఏ జరిగిందో పార్టీ వర్గాలు చూశాయి. కానీ.. కేబినెట్లో చోటు కోల్పోయిన నాయకులు.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు.. ఆధిపత్యపోరుతో నిత్యం వర్గపోరు రాజేస్తున్న ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఏదో ఒక రూపంలో సడెన్‌గా భగ్గుమంటున్నారు. అసంతృప్త…
వైసీపీలో నెమ్మదిగా లుకలుకలు బయటపడుతున్నాయి. సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని సోమవారం మాజీ మంత్రి బాలినేని ఆరోపించగా.. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా సేమ్ డైలాగ్స్ చెప్పారు. తాను కూడా బాలినేని తరహాలో సొంత పార్టీ నేతల బాధితుడినేనని కోటంరెడ్డి స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలతో తాను కూడా ఇబ్బంది పడుతున్నానని.. కొందరు ఎమ్మెల్యేలు తన నియోజకవర్గంలో వేలుపెడుతున్నారని.. తన విషయంలో కూడా ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తాను కూడా…
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని నేతృత్వంలో ఈ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయగా మంత్రి జోగి రమేష్, ఎంపీ బాలశౌరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రజా నాయకుడు అని.. ఆయన ఏ పార్టీకి చెందినవారు కాదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు, టీడీపీకి సంబంధం లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు…
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో వైసీపీ నాయకుడి దాష్టీకం బయటపడింది. ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేసి ఏజెంట్‌గా నిలబడ్డారన్న అక్కసుతో బీజేపీ మహిళా నేతపై వైసీపీ నాయకుడు హజరత్తయ్య దాడికి పాల్పడ్డాడు. గొల్లపల్లి గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళను ఇంటికి పిలిపించి కొట్టి, చిత్రహింసలకు గురిచేసి రూమ్‌లో నిర్బంధించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని మహిళను బెదిరించాడు. అయితే బాధిత మహిళ భయపడకుండా వైసీపీ నేత హజరత్తయ్యపై…