Minister Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తునిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్వాతంత్ర్య స్ఫూర్తితో జనసేన స్థాపించలేదని ఆరోపించారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా కొమ్ముకాయడానికే పార్టీ స్థాపించాడని.. ప్రస్తుతం ఆ విధంగానే పవన్ అడుగులు వేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ విచిత్రమైన రాజకీయ రాజకీయాలు చేస్తున్నారని.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పవన్ విన్యాసాలు ఉన్నాయని చురకలు అంటించారు. పవన్ అసలు నీకు స్వాతంత్య్రం…
Minister Venugopala Krishna: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశిస్తూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు చేశారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన అనైతిక కలయికలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, పరిపాలన పట్ల చంద్రబాబు మాట్లాడలేడు అని.. ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నేతలను దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిదర్శనమని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. వైసీపీ నేతలపై బురద జల్లి లబ్ధి పొందాలని…
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. కోస్తా, ఆంధ్ర, గోదావరి జోన్ల బీజేపీ పదాధికారుల సమావేశంలో సునీల్ ధియోధర్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. అసలు వైసీపీ ప్రభుత్వం తోలు మందం ప్రభుత్వం.. బుర్రలేని ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు.. నేచుర్ క్యూర్ ఆసుపత్రికి గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇళ్ళ పట్టాల పేరుతో ఈ ప్రభుత్వం నిర్వీర్యం…
భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర దినోవత్స ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. మా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు జగన్. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రికరణే మా విధామని జగన్ పేర్కొన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి, సమతౌల్యాన్నికి ఇదే…
India Today Survey: మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో దేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోదీకే పట్టం కడతారని స్పష్టమైంది. అయితే 2019లో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి మెజారిటీ తగ్గుతుందని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 2019 ఎన్నికల్లో 303 సీట్లు వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ 286 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది. గత…
30 Years Prudhvi: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో ఒరిజినల్ కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించినా ఈ అంశంపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ స్పందించి ఈ అంశంపై విచారణ చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఏపీ డీజీపీని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు గోరంట్ల మాధవ్ వీడియోపై వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ స్పందించారు. అంగబలంతో పాటు…
Kodali Nani: గత కొన్నిరోజులుగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే బూతు పదాలతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఫేక్ అని పోలీసులు చెప్పినా టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. లింగ పరిశోధనలో నిష్ణాతులైన టీడీపీ వాళ్లు.. రాష్ట్రంలో ఏది ఎవరిదో కూడా తేల్చి ఐడీ కార్డులు ముద్రిస్తారా అంటూ…
నేను పార్టీ మారుతున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా కోవూరులో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ విజయమ్మ తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేను నేనే అన్నారు.. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో నేను పార్టీ మారుతున్నాని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో నేను తిట్టినంతగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు…
Vangalapudi Anitha: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రిపోర్టుపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అనుకున్నట్లే జరిగిందని.. తప్పును కప్పిపుచ్చడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. డర్టీ ఎంపీ మాధవ్‌కు సచ్చీలుడు అన్న సర్టిఫికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. దీన్ని సమర్థిస్తున్నారా లేదా అనేది సీఎంగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర మహిళల…
Nara Lokesh: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ వెల్లడించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో..? ఏది రియలో..? ప్రజలే తేలుస్తారని లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎంపీ మాధవ్ వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఎలా తేల్చారని ప్రశ్నించారు. అంటే ఒరిజినల్ వీడియో ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని నిలదీశారు. అనంతపురం ఎస్పీ ఏమైనా ఫోరెన్సిక్ ఎక్స్‌పర్టా అంటూ లోకేష్…