ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి.. దీనిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.. ఇక, చివరిసారిగా జులై 19 నుంచి ఐదురోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.. అయితే, ఈ సారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలకు రావాలి కోరారు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్‌రాజు.. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతోన్న నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రేపు ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి.. జీరో అవేర్ తర్వాత బీఏసీలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Read Also: Jammalamadugu Politics : ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది..? ఎవరి ట్రాప్ లో ఎవరు పడ్డారు..?
అన్ని అంశాలపై చర్చ బాగా జరగాలనే ప్రభుత్వం కోరుకుంటుందన్నారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు.. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశంపై సమాధానం చెప్పటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తాం అన్నారు.. మూడు రాజధానుల విషయంలో గత అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు.. అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. అవసరమైతే మూడు రాజధానుల బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందన్న ఆయన.. ఎప్పుడు ప్రవేశపెడతారు అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రజలకు మేలు చేసే విధంగా బిల్లులు ఉంటాయి.. కానీ, అందరికీ నచ్చినట్లు చేయటం ఎవరికీ సాధ్యం కాదన్నారు చీఫ్ విప్ ప్రసాద్‌రాజు.