BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Rs 259 Broadband Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మరో చవకైన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.259 ధరతో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకవచ్చింది బిఎస్ఎన్ఎల్. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌నెట్ (BharatNet) కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు ఈ ప్లాన్‌ను తీసుకవచ్చారు.
రూ.259 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్:
బిఎస్ఎన్ఎల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో వినియోగదారులకు 25Mbps వేగంతో అన్లిమిటెడ్ డేటా, దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అంతేకాకుండా వినోదం కోసం వేవ్స్ OTT సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. ముఖ్యంగా ఈ ప్లాన్‌లో ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేవు. దీంతో మొదటిసారి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే గ్రామీణ వినియోగదారులకు ఇది మరింత ప్రయోజనకరంగా మారనుంది. ఆన్లైన్ చదువులు, వర్క్ ఫ్రం హోమ్, వీడియో కాల్స్, OTT వినోదం వంటి అవసరాలకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
రూ.51 ప్రీపెయిడ్ ప్లాన్:
బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో పాటు కొత్త మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూ.51 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను కూడా ప్రకటించింది. కొత్తగా BSNL సిమ్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 2GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు అందించనున్నారు. అదనంగా ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. ఇది ప్లాన్ ఒక ప్రమోషనల్ ఆఫర్. ఇది 2026 జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతకుముందు కూడా కంపెనీ కేవలం రూ.1 రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టి 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, డేటా ప్రయోజనాలను అందించింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!