Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
- పారాసెటమాల్ ట్యాబ్లెట్‌తో మొండి మరకలకు చెక్
- బేకింగ్ సోడా, పెరాక్సైడ్‌తో సూపర్ క్లీనింగ్
- నిమ్మరసం-ఉప్పుతో సహజ శుభ్రత
- ఐరన్ క్లీన్ చేసేటప్పుడు తప్పనిసరి జాగ్రత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iron Box Cleaning : దుస్తులను ఎక్కువసేపు ఇస్త్రీ చేస్తున్నప్పుడు లేదా బట్ట రకాన్ని బట్టి ఉష్ణోగ్రతను (Temperature) సరిగ్గా సర్దుబాటు చేయనప్పుడు బట్టలు మాడిపోయి ఐరన్ బాక్స్ అడుగు భాగానికి (సోల్‌ప్లేట్) అంటుకుపోవడం సర్వసాధారణం. ఇస్త్రీ చేసేటప్పుడు వేడిగా ఉన్న ఐరన్ బాక్స్‌ను ఒకే చోట ఉంచి నిరంతరం కదపకుండా ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఐరన్ బాక్స్ అడుగు భాగం మాడిపోయి నల్లగా మారిపోతుంది. ఈ నల్లని మరకలను అలాగే వదిలేస్తే, ఆ తర్వాత ఇస్త్రీ చేసే ఇతర తెల్లటి లేదా మంచి బట్టలకు కూడా ఆ మరకలు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే, ఐరన్ బాక్స్ అడుగు భాగానికి అంటుకున్న మొండి మరకలను ఇంట్లోనే సులభంగా, సమర్థవంతంగా ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం.
1. పారాసెటమాల్ టాబ్లెట్ ట్రిక్
ఐరన్ బాక్స్ అడుగు భాగంలోని మాడిన మరకలను తొలగించడానికి మనం జ్వరం వచ్చినప్పుడు వేసుకునే పారాసెటమాల్ మాత్ర అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా ఐరన్ బాక్స్‌ను కాసేపు ఆన్ చేసి, తగినంత వేడెక్కాక స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయాలి. ఇప్పుడు ఒక చిమట (ట్వీజర్) లేదా పుల్ల సహాయంతో పారాసెటమాల్ టాబ్లెట్‌ను పట్టుకుని, ఐరన్ బాక్స్ అడుగున మరక ఉన్న ప్రదేశంలో రుద్దాలి. వేడికి ఆ మాత్ర కరిగిపోయి మరకలను వదిలిస్తుంది. ఆ తర్వాత ఒక తడి దూది లేదా మెత్తటి గుడ్డతో సోల్ప్లేట్ను శుభ్రంగా తుడవాలి. ఐరన్ చల్లారితే మళ్లీ కాసేపు వేడి చేసి ఈ ప్రక్రియను పునరావృతం చేయవచ్చు. అయితే, మాత్ర కరిగేటప్పుడు వచ్చే పొగను పీల్చకూడదు; ఇది దగ్గు లేదా అలర్జీలకు కారణం కావచ్చు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఐరన్ బాక్స్ స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు ఈ పని చేయకూడదు.
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
2. హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా పేస్ట్
ఐరన్‌పై ఉన్న ఎలాంటి కఠినమైన ముాలనైనా వదిలించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో 4-5 టీస్పూన్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రవాన్ని తీసుకుని, అందులో 2-3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఐరన్ బాక్స్ కింది మాడిన భాగానికి పూర్తిగా పూసి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత, ఒక క్లీనింగ్ బ్రష్‌తో మెల్లగా రుద్ది తూడిస్తే ఐరన్ బాక్స్ పూర్తిగా శుభ్రపడుతుంది.
3. కేవలం బేకింగ్ సోడాతో సులభంగా..
ఐరన్ బాక్స్ అడుగు భాగానికి అంటుకున్న తుప్పు , నల్లటి మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా మరొక సులభమైన గృహ చిట్కా. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో కలిపి చిక్కటి పేస్ట్‌లా మార్చాలి. ఈ పేస్ట్‌ను ఐరన్ బాక్స్ ఉపరితలంపై పూసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. సమయం పూర్తయిన తర్వాత, ఒక తడి మెత్తటి గుడ్డతో లేదా కాటన్ ప్యాడ్‌తో శుభ్రంగా తుడిచివేస్తే మరకలు మాయమవుతాయి.
4. నిమ్మరసం , ఉప్పు మిశ్రమం
ఐరన్ బాక్స్ అడుగున తుప్పు పట్టినా లేదా బట్టల ముక్కలు మాడిపోయి అంటుకున్నా వాటిని వదిలించడానికి ఉప్పు, నిమ్మరసం కలయిక అత్యంత ప్రభావవంతమైన సహజమైన మార్గం. ఒక గిన్నెలో ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కొద్దిగా ఉప్పుతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ఐరన్ బాక్స్ అడుగున ఉన్న ఇనుప పలకపై గల మరకలపై పూసి 5-10 నిమిషాల పాటు ఉంచాలి. ఇందులో ఉండే ఉప్పు ఒక స్క్రబ్బర్‌లా పనిచేసి మాడిన మరకలను సులభంగా తొలగిస్తుంది. పని పూర్తయ్యాక పొడి, శుభ్రమైన గుడ్డతో ప్లేటును క్షుణ్ణంగా తుడవాలి.
5. వెనిగర్ , ఉప్పు ద్రావణం
ఇనుప సోల్ప్లేట్ను శుభ్రపరచడానికి వెనిగర్ , ఉప్పును ఉపయోగించడం చాలా పాత, నమ్మకమైన పద్ధతి. రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు ఒక టీస్పూన్ ఉప్పును కలిపి, తక్కువ మంట మీద స్టవ్‌పై ఉంచి వేడి చేయాలి. ఉప్పు పూర్తిగా కరిగిన తర్వాత, దానిని స్టవ్ పైనుంచి దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతులకు గ్లోవ్స్ ధరించి, ఒక దూది లేదా కాటన్ వస్త్రాన్ని ఆ వెనిగర్ మిశ్రమంలో ముంచి, ఐరన్ బాక్స్ అడుగు భాగాన్ని రుద్దాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించేటప్పుడు ఐరన్ బాక్స్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేసి ఉండాలి , అది పూర్తిగా చల్లగా ఉండాలి. ఐరన్‌పై గీతలు పడకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ మృదువైన వస్త్రాన్ని మాత్రమే వాడాలి.
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐరన్ బాక్స్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన భద్రతా నిబంధనలను పాటించడం చాలా అవసరం. ఐరన్ బాక్స్‌ను శుభ్రం చేయడానికి ముందు ఎల్లప్పుడూ ప్లగ్‌ను సాకెట్ నుండి తొలగించాలి. ఐరన్ బాక్స్‌ను నేరుగా నీటిలో గానీ లేదా మరేదైనా ద్రవంలో గానీ ఎప్పుడూ ముంచకూడదు. అలా చేయడం వల్ల ఉపకరణంలోని అంతర్గత విద్యుత్ భాగాలలోకి నీరు ప్రవేశించి, ఐరన్ బాక్స్ పాడవడమే కాకుండా భవిష్యత్తులో షార్ట్ సర్క్యూట్ లేదా కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!