Thopudurthi Prakash Reddy: టీడీపీ నేతలకు రాప్తాడు ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ చేశారు. తనపై ఐ-టీడీపీ, చైతన్య రథం అనే ఈ పేపర్ ద్వారా గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను హత్యలు చేయించానని రాశారని.. దీనిపై సీఐడీ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై డీఐజీకి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రాజారాం, ఈశ్వరయ్య అనే వ్యక్తులను తాను చంపానని రాశారని.. కానీ వారు బ్రతికే ఉన్నారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. పరమేశ్వరరెడ్డి అనే సివిల్ సప్లైస్ కాంట్రాక్టర్‌ను డబ్బులు అడిగానని రాశారని.. ఈ విషయాలపై తాను కాణిపాకంలో ప్రమాణం చేస్తానని.. మీరు చేస్తారా అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.
Read Also:Palmoil Farmers Meet Tummala: ఏలూరు జిల్లాలో పామాయిల్ రైతుల కష్టాలు
గత ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల సునీత, శ్రీరామ్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పరిటాల శ్రీరామ్‌కు బెంగళూరు, హైదరాబాద్‌లో పబ్బులు ఉన్నాయని.. కబ్జాలు, దౌర్జన్యాలు మీరే చేస్తారు.. మళ్లీ తమపై నిందలు వేస్తారంటూ టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. తమకు వెయ్యి కోట్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని.. ఓ వంద కోట్లు ఇవ్వండి.. ఎక్కడైనా సంతకం చేస్తామన్నారు. పరిటాల శ్రీరామ్ గెలుస్తాడని కొందరు అమాయకులు రూ.300కోట్లు పందేలు కాసి పోగొట్టుకున్నారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. ఐ-టీడీపీ నడిపే వాళ్ల మీద కేసు వేస్తానని.. ఆ తర్వాత వెతికి కుక్కను కొట్టినట్లు కొడతానని హెచ్చరించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనపై ఆరోపించిన విషయాలపై సీబీఐ విచారణకు కోరాలని హితవు పలికారు. టీడీపీ నేతల బొచ్చు పీకాల్సిన తమకేంటని.. తమకు చాలా పనులు ఉన్నాయన్నారు. భార్యను బజారుకీడ్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని.. గన్‌మెన్‌లు లేకుండా చంద్రబాబు బయటకు తిరగలేరని.. తాను ఐదేళ్లు తిరిగానని గుర్తుచేశారు. నక్సల్స్ పేరుతో వంద మందిని చంపారని.. పరిటాల కుటుంబంపై ఆ ముద్ర ఉందని.. వాళ్ల చరిత్ర గురించి రక్త చరిత్ర అనే సినిమా తీశారని చురకలు అంటించారు.