Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
- సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్
- 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
- ప్రారంభ ధర 349.99 డాలర్లు (సుమారు రూ.30,000)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సామ్ సంగ్ గెలాక్సీ A సిరీస్‌లో కొత్త Galaxy A27 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్లలో అధికారికంగా విడుదల చేసింది. మిడ్-రేంజ్ విభాగంలో లాంచ్ అయిన ఈ ఫోన్ 120Hz AMOLED డిస్ప్లే, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ, AI ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోనుంది.
ధర, లభ్యత
అమెరికాలో Samsung Galaxy A27 5G ప్రారంభ ధర 349.99 డాలర్లు (సుమారు రూ.30,000)గా నిర్ణయించారు. అక్కడ ఈ ఫోన్ జూలై 14 నుంచి బ్లాక్ కలర్లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే జూలై 3 నుంచి బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, లైట్ పింక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.
Also Read
- Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
- Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
- Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
- Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
6.7-అంగుళాల AMOLED డిస్ప్లే
Galaxy A27 5Gలో 6.7-అంగుళాల Full HD+ Super AMOLED Infinity-O డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో రావడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్, వీడియో వీక్షణ మరింత స్మూత్‌గా ఉంటుంది.
Snapdragon 6 Gen 3 ప్రాసెసర్
ఈ ఫోన్లో 4nm టెక్నాలజీపై రూపొందించిన Qualcomm Snapdragon 6 Gen 3 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇందులో 8GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది.
50MP ట్రిపుల్ కెమెరా
ఫోటోగ్రఫీ కోసం Galaxy A27 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను అందించారు. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
5,000mAh బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీను అమర్చారు. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
AI ఫీచర్లు, భద్రత
Galaxy A27 5Gలో Circle to Search, Object Eraser, Voice Transcription వంటి ఆధునిక AI ఫీచర్లను అందించారు. అలాగే Google Gemini, Perplexity AI, Bixby వంటి AI అసిస్టెంట్లకు మద్దతు ఉంది. భద్రత కోసం Samsung Knox Vault సెక్యూరిటీ సిస్టమ్‌ను అందించగా, నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ను కలిగి ఉంది.
ఆరు సంవత్సరాల అప్డేట్లు
ఈ ఫోన్ One UI 8.5 ఆధారిత Android 16పై పనిచేస్తుంది. ముఖ్యంగా 6 సంవత్సరాల Android OS అప్డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని సామ్ సంగ్ ప్రకటించడం ఈ ఫోన్‌కు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. Galaxy A27 5G కొలతలు 162.4 × 78.2 × 7.8 మి.మీ., బరువు 200 గ్రాములు. స్లిమ్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా నిలవనుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Illandu Missing Person : ఇల్లందులో 45 రోజులుగా కనిపించని వ్యక్తి.. వీడని మిస్టరీ
-
SL Vs PAK: శ్రీలంకపై పాకిస్థాన్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇలా..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!