52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Nord Buds 4 Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో కొత్త ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ OnePlus Nord Buds 4ను లాంచ్ చేసింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, AI ఫీచర్లు, లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలతో ఈ ఇయర్‌బడ్స్ వచ్చింది. డిజైన్ పరంగా చూస్తే.. గత మోడల్లో ఉన్న పెబుల్ ఆకారపు కేసుకు బదులుగా ఈసారి కొద్దిగా చతురస్రాకారంలో ఉండే వర్టికల్ ఛార్జింగ్ కేస్‌ను కంపెనీ అందించింది. ఒక్కో ఇయర్‌బడ్ కేవలం 4.3 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో ఎక్కువసేపు ధరించినా అసౌకర్యం కలగదు.
OnePlus Nord Buds 4లో 12mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. ఇవి మెరుగైన బాస్, క్లియర్ ఆడియో అనుభూతిని అందిస్తాయి. అలాగే 5000Hz బ్యాండ్‌విడ్త్‌తో కూడిన 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉండటం వల్ల బయటి శబ్దాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌లో బ్లూటూత్ 6.1 కనెక్టివిటీ, SBC అండ్ AAC కోడెక్ సపోర్ట్, డ్యూయల్ డివైస్ కనెక్షన్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాల్స్ సమయంలో స్పష్టమైన వాయిస్ కోసం ఒక్కో ఇయర్‌బడ్‌లో మూడు చొప్పున మొత్తం ఆరు మైక్రోఫోన్లు అమర్చారు. AI కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో కాల్ నాణ్యత మరింత మెరుగ్గా ఉంటుంది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
AI ఫీచర్ల విషయానికి వస్తే.. AI Assistant ద్వారా అలారంలు, రిమైండర్లు, వాతావరణ సమాచారం వంటి పనులను వాయిస్ ద్వారా నిర్వహించవచ్చు. అలాగే ఎంపిక చేసిన OnePlus స్మార్ట్ఫోన్లతో ఉపయోగించినప్పుడు AI ట్రాన్సలేట్ ఫీచర్, టైమ్ అనువాద సౌకర్యాన్ని అందిస్తుంది. బ్యాటరీ విషయంలో ANC ఆఫ్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ 13 గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 54 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందుతుంది. ANC ఆన్‌లో 27 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండగా.. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 11 గంటల వరకు ప్లేబ్యాక్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.
వీటికి IP55 రేటింగ్ లభించింది. దీంతో చెమట, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. టచ్ కంట్రోల్స్ ద్వారా పాటలను మార్చడం, ప్లే/పాజ్ చేయడం, వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం వంటి పనులు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ స్టెల్లార్ బ్లాక్, ఆస్ట్రల్ టీల్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ధర విషయానికి వస్తే.. వీటి ధర రూ. 3,299గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్లో భాగంగా పరిమిత కాలానికి రూ. 3,099కే కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ ఇయర్‌బడ్స్ జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్, మింత్రా, బ్లింకిట్, వన్ ప్లస్ స్టోర్లలో అమ్మకాలకు అందుబాటులో ఉంటాయి.
Meet the #OnePlusNordBuds4, packed with up to 52dB ANC, 54 hours of playback, 12mm Titanium Drivers, and features designed to make every listen better.
Get notified: https://t.co/s811QU2mQ4 pic.twitter.com/hEPIKEpoGn
— OnePlus India (@OnePlus_IN) June 25, 2026
తాజావార్తలు
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!