తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఏర్పాటుచేశాయి ఆ పార్టీ శ్రేణులు.. రామకుప్పం మండలం కొల్లుపల్లెలో వైసీపీ జెండాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు, అంతేకాదు దారి పొడువునా వైసీపీ తోరణాలు కట్టారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. పోలీసుల సహకారంతోనే…
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ అనేది కొద్ది రోజుల్లో తెలియజేస్తా అంటున్నారు.. అంతే కాదు.. తాను ఒక్క నియోజక వర్గానికి పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నేను చేరే పార్టీకి మేలు జరిగేలా కృషి చేస్తానన్నారు.
GVL Narasimha Rao: తెలుగు రాష్ట్రాలలో స్కాంలు జరుగుతున్నాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తున్నాయని.. ఈ స్కాం ద్వారా అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూరిందనే ప్రచారం జరుగుతోందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గ్రేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలన్నారు. అటు ఏపీలో లేపాక్షి భూముల వ్యవహారం పెద్ద ల్యాండ్…
Lakshmi Parvathi: తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంపై ఆమె స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అదే తన కోరిక అని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి మహానేత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని…
దేవాదాయ, ధర్మాదాయశాఖపై ప్రతీ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ప్రతీ మంగళవారం ధర్మాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష చేపడుతున్నాం, అర్చకులకు సంబంధించిన గౌరవ వేతనం పెంపుదలపై కసరత్తు జరుగుతోందన్నారు. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేశారు.. అటువంటి ఎయిడెడ్ కాలేజీల గడువు ముగిసిన తర్వాత నిర్వహణ కష్టం అవుతుందని తెలిపారు.. హిత కారిణి సమాజం ద్వారా ఏర్పాటు చేసిన కాలేజీను విద్యాశాఖకు…
Vellampalli Srinivas: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ప్రభుత్వంపై అక్కసుతో పవన్ కళ్యాణ్ కావాలనే అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఆరోపించారు. ఆనాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్టు పవన్ కళ్యాణేనని విమర్శించారు. చిరంజీవి 18 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కాగానే బయటకు వెళ్ళిపోయిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా.. ఆ…
CM Jagan Mohan Reddy Prakasam District Tour Schedule: ఈనెల 24న ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన చీమకుర్తిలో పర్యటించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు తాడేపల్లిలోని తన…
YSRCP: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ అధిష్టానం నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి ఏకంగా జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటివద్ద ఆందోళనకు దిగారు. డొక్కా గో బ్యాక్ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ నినాదాలు చేశారు. కానీ రెండు రోజుల్లో నేతలు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. నిన్నటివరకూ డొక్కాకు అదనపు సమన్వయకర్త పదవి రద్దు చెయ్యాలని అధిష్టానాన్ని డిమాండ్…
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు.. తాజాగా, పవన్ చేసిన వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కామెంట్లపై ఘాటుగా స్పందిస్తున్నారు ఆ పార్టీ నేతలు.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అమర్నాథ్… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో పుట్టిన రోజు నాడు చిరంజీవికి వేదన మిగులుస్తున్నారన్నారు.. కొణిదెల పవన్ కల్యాణ్ అనాలో.. నారా, నాదెండ్ల పవన్ కల్యాణ్ అనాలో కూడా అర్ధం కావడం లేదన్న ఆయన.. మెగాస్టార్ కుటుంబంలో అమ్ముడిపోయే వ్యక్తి ఉన్నందుకు బాధపడుతున్నాం..…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు గుప్పించారు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా… మా వ్యూహాలు మాకు ఉంటాయి.. ఎప్పటికప్పుడూ అవి మారుతూ ఉంటాయి.. మొత్తంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తామంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై స్పందించిన ఆయన.. పవన్ కల్యాణ్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయ్యింది అంటూ విమర్శలు గుప్పించారు.. బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారం ఇదీ పవన్ పార్టీ పరిస్థితి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాడిశెట్టి.. అది జనసేన…