Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో 11KV హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి కలకలం రేపాడు. ఈ ఘటన స్థానిక గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేయగా.. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు కలిసి గంటల తరబడి శ్రమించి అతడిని సురక్షితంగా కిందకు దించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు.
ఈ ఘటన మంగళవారం సాయంత్రం పర్సా ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దీన్ దయాల్ అనే వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్ స్తంభాన్ని ఎక్కి, పైభాగంలోని విద్యుత్ తీగలపై పడుకున్నాడు. ఈ విషయం గ్రామమంతా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. కొంతమంది వీడియోలు తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొందరు అతడిని కిందకు రావాలని కోరుతూ పిలుస్తున్నా.. దీన్ దయాల్ మాత్రం గంటల తరబడి స్తంభంపైనే ఉండిపోయాడు.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ఘటనపై గ్రామస్థుల సమాచారం ప్రకారం.. దీన్ దయాల్ స్తంభం ఎక్కే కొద్ది నిమిషాల ముందే ఆ లైన్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రమాదం తప్పిందని వారు చెబుతున్నారు. 11KV విద్యుత్ ప్రవహించే లైన్లో కరెంట్ కొనసాగి ఉంటే ఘటన విషాదాంతమయ్యేదని స్థానికులు అంటున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన భిటౌలి పోలీసులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి, రక్షణ చర్యలు పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్థులు కలిసి దీన్ దయాల్‌ను కిందకు దించేందుకు చాలా సమయమే ప్రయత్నించారు. అతడి మత్తును వదిలిస్తూ., ప్రమాదాన్ని వివరించి ఒప్పించే ప్రయత్నాలు చేశారు. చివరకు వారి ప్రయత్నాలు ఫలించి.. గంటల తర్వాత అతడు సురక్షితంగా కిందకు దిగాడు. అతడు కిందకు రావడంతో అక్కడ చేరుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
In Maharajganj, UP: A drunk man couldn’t find fresh air on the ground, so he climbed a pole and slept for hours on 11,000V live high-tension wires.
Power was cut off entirely while officials begged him to come down. pic.twitter.com/fZ1rUjr8dI
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 24, 2026
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!