వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రతిష్టాత్మక “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ లక్షా 24 వేల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికి అందించడంలో విశేష కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ అవార్డుకు అర్హత సాధించారు. తిరుపతి రూరల్ పరిధిలోని చిగురువాడ అకార్డ్ స్కూల్ అవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..…
Party Funds: గుర్తు తెలియని మూలల నుంచి వచ్చే విరాళాల్లో ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్ సీపీ దేశంలోనే టాప్ లో నిలిచింది. మొత్తం 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన గుప్త నిధుల్లో ప్రాంతీయ పార్టీల్లో వైసీసీ మొదటిస్థానంలో ఉంది. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020-21 మధ్య అన్ని జాతీయ పార్టీలకు కలిపి రూ. 15,077 కోట్ల గుప్త నిధులు వచ్చినట్లు…
Minister Roja: రాజమండ్రిలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని.. చంద్రబాబు ఫోటో…
తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది.. పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం, వాగ్వాదం, దాడుల వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, కేసుల పరంపర కూడా కొనసాగుతోంది.. అయితే, కుప్పంలో జరిగిన పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు చంద్రబాబు నాయుడు.. అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై దాడులా..? ఇదేం రాజకీయం..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. కుప్పంలో కొత్త సంస్కృతి కోసం…
వైసీపీ విముక్త ఏపీ అని అంటున్నారు.. అంటే పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం ఏమీ ఉండకుండా చేయటమే తన లక్ష్యం అని చెప్పినట్టే అన్నారు.. ఇలా తెలిసే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారో... ఎవరైనా చెబితే చేస్తున్నారో? అని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి
చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు ఆ శాఖకు తీరని మచ్చగా పేర్కొన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య.. కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరు అధికార పార్టీతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు..
రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంత సిద్దం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై ప్రశంసలు కురిపించారు.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అన్నారు.
సీఎం వైఎస్ జగన్ అరాచక రాజకీయాలను కట్టిపెట్టాలని ఫైర్ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న పరిస్థితులపై స్పందించిన ఆయన.. ప్రతిపక్షనేత చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడే అన్నారు.. చంద్రబాబు పర్యటన సందర్భంగా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్యగా మండిపడ్డ ఆయన.. ఈ ఘటనకు సీఎం వైఎస్ జగన్, జిల్లా మంత్రి…
తన సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు.. కొన్ని ప్రాంతాల్లో.. చంద్రబాబు టూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శాంతిపురం మండలం, కొంగణపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వానికి శీతకన్ను వేసింది ఫైర్ అయ్యారు.. నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదని ఆరోపించిన ఆయన.. ఈ చేతగాని ప్రభుత్వం… మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు.. నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ హోంమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత.. పవన్ కల్యాణ్ వైసీపీ విముక్త ఏపీ అంటూ కలలు కంటున్నారు.. అలాగే కననివ్వండి అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది.. ఏదైనా మాట్లాడొచ్చు అన్నారు.. మరోవైపు.. గడపగడపకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా ఉందో తెలుసుకునే అవకాశం వస్తుంది……