CM Jagan: కడప జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరనున్నారు. మధ్యాహ్నం 3:50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామంలో పర్యటిస్తారు. అదేరోజు సాయంత్రం 5:35 గంటలకు హెలికాప్టర్లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు.
Read Also: Increase Credit: క్రెడిట్ పెంచుకోండి. ఎన్పీఏల పైనా ఫోకస్ పెట్టండి.
Also Read
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
కాగా సెప్టెంబరు 1న వేల్పుల గ్రామంలోని సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 2వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్‌లో ఉదయం 9 గంటల నుంచి ఉదయం 9:40 గంటల వరకు సీఎం జగన్ ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పులివెందుల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష చేపడతారు. సెప్టెంబర్ 2న సాయంత్రం 5:10 గంటలకు గెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు సెప్టెంబర్ 3న ఉదయం 8:50 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఉదయం 9:15 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం జగన్ వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!