ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిట్టింగ్ స్ధానమైన అనకాపల్లి వీడి వెళ్లాల్సి వస్తుందన్నందుకు కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకుల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటామని ఆయన అన్నారు.
కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు సమక్షంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ, కడప, అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు తెలుగుదేశంలో చేరారు.
టీడీపీ, చంద్రబాబుకు వైసీపీని చూస్తే ఎందుకు అంత భయమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వైసీపీ ఇంఛార్జ్‌లను మార్చుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పురంధేశ్వరి టీడీపీ బీ టీం అన్న మంత్రి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే స్థితికి పురంధరేశ్వరి వెళ్ళిందని.. కారంచేడులో దళితులు ఎంత మంది చనిపోయారో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఈరోజు కేవలం వివాహ ఆహ్వానం ఇవ్వడానికి మాత్రమే వైఎస్ షర్మిల.. సీఎం జగన్ దగ్గరకు వస్తున్నారు.. అవసరమైతే షర్మిలతో నేను కూడా సీఎం జగన్ ఇంటికి వెళ్తానన్నారు ఎమ్మెల్యే ఆర్కే.
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ ఇంఛార్జి చెల్లుబోయిన వేణు.. ట్రబుల్ షూటర్ ను కాబట్టి నన్ను రాజమండ్రి రూరల్‌కి పంపించారని తెలిపారు. తొలి సారి రాజమండ్రి రూరల్ లో వైసీపీ జెండా ఎగురుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, రామచంద్రపురం లో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడుకి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు.
ద్రగడ చిన్న కోడలు సిరిని తుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపే యోచనలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ముద్రగడ చిన్న కొడుకు గిరిబాబు భార్యనే ఈ సిరి... ఆమె సొంత ఊరు తుని నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం కావడంతో.. సిరిని అదే నియోజకవర్గం నుంచి పోటీకి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.
ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలన వైసీపీ బలం అన్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపించి వైఎస్ జగన్‌ను సీఎంని చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట ఈ రోజు ఆసక్తికర పరిణామాలు జరగబోతున్నాయి.. కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్న షర్మిల.. తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవనున్నారు.. తన కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరితో వివాహ నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేయనున్నారు..