MLA Maheedhar Reddy: నాపై వస్తున్నవి అన్నీ దుష్పచారాలే.. తప్ప వాటిలో వాస్తవాలు లేవని కొట్టిపారేశారు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా గుడ్లూరులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సారి కందుకూరు అసెంబ్లీ సీటు నాకు లేదని.. రాదని కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. నా సీటు ఎక్కడికీ పోలేదు.. నా సీటులో టవలేసి మరీ ఇక్కడే ఉంది అంటూ చమత్కరించారు.. నేను సీట్ల కోసం, పదవులకోసం వెంపర్లాడే వాడిని కాదని స్పష్టం చేశారు. ఇలాంటి సీట్లు, కుర్చీలు ఎన్నో చూశాను.. నన్ను నమ్ముకుని ఉన్న ప్రజల సంక్షేమం కోసం ముక్కుసూటిగా వెల్లే మనిషిని అని పేర్కొన్నాడు. మా ఆలోచన అంతా సీఎం జగన్‌కి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే.. కుర్చీ మీద కాదు అన్నారు. అంతేకాదు.. పార్టీలో సీటు ఇచ్చినా లేకున్నా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆశయాలకు కట్టుబడి పనిచేస్తా.. కొంత మంది పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారు.. ప్రజలు నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు.. ఇక, మెరుగైన పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్ జగన్‌ని అంతా ఆదరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పొత్తులు లేకుండా రావాలని ప్రతిపక్షాలకు సవాల్ చేశారు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి.
Read Also: BRS Fight: బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు.. తెలంగాణ భవన్ వేదికగా గొడవ