వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సాగింది. యాత్ర అనంతరం మల్కిపురం ప్రధాన సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు.
షర్మిల కాంగ్రెస్లో చేరికపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడానికి అలవాటు పడ్డారని.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆమె ఇష్టమన్నారు. చంద్రబాబు రా కదలి రా అని సభ పెట్టారని.. ఎవరు కదలి రావాలి? ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు.
వైసీపీని వీడుతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. సీఎంఓలో పార్టీ కీలక నేతలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు టికెట్ లేదని చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.
మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. సీఎంవోకు వచ్చిన నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేలల్లో గెలవ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తోంది.
ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను అని స్పష్టం చేశారు ఎంఎస్ బాబు.. ఇంట్లో తండ్రిని కొడుకు ఏ విధంగా అడుగుతాడో అదే హక్కుతో నేను మాట్లాడాను.. వాటిని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో పలు అంశాలు పరిశీలించాలంటూ పవన్ కల్యాణ్కు సూచించారు హరిరామ జోగయ్య.. సీఎం వైఎస్ జగన్ను ఓడించాలంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలు అమలు చేయాలన్నారు.