Kodali Nani: 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ సదస్సుపై కౌంటర్ ఇచ్చిన ఆయన.. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి, ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరు నమ్మరు..? అని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను వెనకాల పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు, బీసీలు వెన్నెముక్క అని ఎలా చెప్తారు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప.. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓసీ రిజర్వుడు పదవులను కూడా ఇస్తూ.. బీసీలకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ నాలుగు రాజ్యసభలు బీసీలకు ఇస్తే.. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీకైనా రాజ్యసభ ఇచ్చారా..? అని నిలదీశారు. విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు.. 2024లో చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని పేర్కొన్నాడు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
Read Also: AUS vs PAK: క్యాప్‌తో బంతిని ఆపినా.. 5 పరుగుల పెనాల్టీ ఇవ్వని క్రికెట్ ఆస్ట్రేలియా! కారణం ఏంటంటే
కాగా, టీడీపీ తాజాగా జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. చంద్రబాబు అధ్యక్షతన జయహో బీసీ సదస్సు జరిగింది.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో, వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జయహో బీసీ సదస్సు ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. జయహో బీసీ కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామని… జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన వివరించారు చంద్రబాబు. ఇక, వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని కొనియాడిన ఆయన.. నాలుగేళ్లలో బీసీలకు ఎక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. అయితే, ఈ రోజు చంద్రబాబు వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి కొడాలి నాని.