YSRCP: మూడో లిస్ట్‌పై కొనసాగుతున్న వైసీపీ కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేలల్లో గెలవ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తుంది. ఇప్పటికే కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ రెండు లిస్టులను వైసీపీ విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. అధికారం కోల్పోవద్దనే ఆలోచనలో గెలవని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫస్ట్, సెకండ్ లిస్టులను పార్టీ విడుదల చేసింది. 2024 ఎన్నికల టీమ్‌పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ అభ్యర్థుల మార్పులు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మూడో లిస్ట్ పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Read Also: MLA MS Babu: ఎమ్మెల్యే యూటర్న్..! ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే..!
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం వచ్చారు. గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు సెగ్మెంట్‌లో ప్రత్యామ్నాయం పార్టీ హైకమాండ్ చూస్తున్నట్లు సమాచారం. దీంతో పెద్దలను కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని విఙప్తి చేస్తున్నారు. సీఎంఓకు మైలవరం ఎమ్మెల్యే వసంత, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున రెడ్డి వచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయానికి దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వచ్చారు. పలు నియోజకవర్గాల ఇన్ చార్జీల మార్పులపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 2,3 రోజుల్లో 15 మందితో మూడో లిస్టును వైసీపీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మార్పులపై వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. లిస్ట్‌లో ఎవరి పేరు ఉంటుందోనని ఉత్కంఠ ఉంది.
తాజావార్తలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!