ముఖ్యమంత్రి జగన్ మాటే తమకు వేదమని, ఆయన ఆదేశాలు సిరసావహిస్తామని కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. జగన్ హీరోయిజం చూసి రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే వెల్లడించారు.
రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి ఏపీలో లేదన్నారు.
బీసీల కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని జాతీయ బీసీ అధ్యక్షుడు ,రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. విజయవాడలో బీసీ సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మరోసారి పవన్ కల్యాణ్‌కు సవాల్ చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ నుంచి నాపై పోటీ చేయమని గతంలోనే పవన్ కి సవాలు చేశాను.. కనీసం గ్లాస్ గుర్తు అయినా నా మీద పోటీ పెట్టమని కోరుతున్నాను అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ ఎన్ని రివ్యూలు చేసుకున్న ఓడిస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుంది.. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందన్నారు. షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ, ఎలాంటి సంబంధం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి
కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా మేం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై చర్చ సాగుతోంది. కుదిరిన పొత్తులపై క్లారిటీ లేకపోగా.. కొత్త పొత్తులపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడడం.. కొత్త చర్చకు దారి తీసింది.. అసలు సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో పొత్తుల విషయం ఇంకా అస్పష్టంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. పొత్తుల విషయం ఇంకా ఉందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.