Peddireddy Ramachandra Reddy: హిందూపురంపై పెద్దిరెడ్డి ఫోకస్.. టీడీపీ గెలిచి ఏం చేసింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: హిందూపురం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తూ.. వరుసగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తుండగా.. మరోవైపు.. హిందూపురంపై ఫోకస్ పెట్టారు మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వరుసగా ఆరు రోజులపాటు నియోజవర్గంలో పర్యటించనున్నారు.. ఎన్ని సార్లు హిందూపూర్ ప్రజలు ఒకే పార్టీని గెలిపించినా హిందూపూర్ ఏమి అభివృద్ధి చెందింది.? అని ప్రశ్నిస్తున్నారు.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి .. బీసీ మహిళలను హిందూపూర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమించారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని చెప్పి.. అవి చేతల్లో చూపించే గొప్ప నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చి ఓట్లు ఆశించారు. 2014లో చంద్రబాబు రైతు, మహిళా రుణమాఫీలు అని చెప్పి మోసం చేశారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా పెన్షన్ మూడు వేలు చేసిన ఘనత వైఎస్ జగన్ దే అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
Read Also: Amitabh Bachchan: మా ఆత్మగౌరవాన్ని తగ్గించొద్దు.. లక్షద్వీప్‌కు సపోర్ట్ గా బిగ్ బీ..
Also Read
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ఎన్నికలు ముందు పసుపు కుంకుమ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబు మనస్తత్వం అని మండిపడ్డారు పెద్దిరెడ్డి.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు అకౌంట్ లో వేయడం ఏ రోజు ఆలస్యం కాలేదన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాం.. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ స్థాయిలో హామీలు అమలు చేసిన వారిని చూడలేదన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్.. కరోనా సమయంలో హైదరాబాద్ లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు కరోనాలో అండగా నిలిచిందన్న ఆయన.. ఏకకాలం లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కితే.. బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పి మోసం చేయిన ఘనత చంద్రబాబుది అని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేసే జగన్ ను ఆదరించాలా ? లేదా హామీలను మర్చిపోయే చంద్రబాబు చేతిలో మోసపోవాల అనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు