MLA Jonnalagadda Padmavathi: అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం కొన్ని ప్రాంతాల్లో రచ్చ సృష్టిస్తోంది.. ఉమ్మడి అనంతపురంలో ఉన్న రెండూ ఎంపీ స్థానాలనూ.. 3 అసెంబ్లీ స్థానాలను వైసీపీ అధిష్టానం మార్చేసింది. అంతేకాదు మరో నాలుగు స్థానాల్లో మార్పు చేర్పులు ఉండొచ్చంటూ సంకేతాలు ఉన్నాయి.. ముఖ్యంగా సింగనమల, మడకశిర, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల్లో మార్పు కన్ఫర్మ్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించగా.. సింగనమల, మడకశిరలోనూ మార్పు తథ్యం అనే టాక్ నడుస్తోన్న సమయంలో.. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి..
Read Also: Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు
ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు ఎందుకు? అని ప్రశ్నించారు. ఒక ఎస్సీ మహిళను కాబట్టే అంత చిన్న చూపా…? అని నిలదీశారు. ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే మీకెందుకు అంత బాధ.? సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలంటే ప్రతిసారి యుద్ధం చేయాల్సి వస్తోంది.. మా కాలువల ద్వారా కుప్పంకు నీళ్లు తీసుకెళ్తుంటే చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా.. తమకు నీరు రాకుండా కొంతమంది సీఎం వద్ద పంచాయితీలు పెట్టే స్టేజ్ కి వెళ్ళింది.. జిల్లా నేతలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా, ఇరిగేషన్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని.. కనీసం ఒక్క చెరువుకు నీరు విడుదల చేయాలని అడిగితే కూడా జిల్లా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Maldives: భారత్- మాల్దీవుల మధ్య వివాదం.. చైనా పర్యటనకు అధ్యక్షుడు ముయిజ్జూ..
ఇక, ఐదు సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారని.. అయితే ప్రజలకు ఇవ్వాల్సిన తాగు, సాగునీరు ఇవ్వడం కోసం పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు ఎమ్మెల్యే పద్మావతి.. ఇదే సమయంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.. నీటి కోసం నియోజకవర్గంలోని ప్రజలందరూ తనకు మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.. ఎస్సీ మహిళ అయితే మీ కాళ్లు పట్టుకోవాలా..? అందరి కింద అణిగి మణిగి ఉండాలా? ఎవరోఇగో శాటిస్పై చేయడం కోసం వాళ్ల కాళ్లు పట్టుకోవాలా? అంటూ ధ్వజమెత్తారు.. నీటి వాటా కోసం మాట్లాడకూడదు.. మాట్లాడితే పెద్ద నేరం అది.. ఈ ఐదేళ్ల టర్మ్ లో ఎన్నోసార్లు నన్ను ఇబ్బంది పెట్టారంటూ సోషల్ మీడియా లైవ్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పద్మావతి.
Read Also: CM Revanth Reddy: యశోద ఆస్పత్రిలో సీఎం.. వెంకట్‌రెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి
గడపగడప తిరిగితే ఇమేజ్ పెరుగుతుందని జగనన్న చెప్పారు.. మేం గడపగడప కార్యక్రమం సక్సెస్ పుల్ గా నిర్వహించాం అన్నారు ఎమ్మెల్యే పద్మావతి.. 2014 – 2019 లాగే క్యాస్ట్ ఈక్వేషన్ 2024 లో ఉంటాయి.. నేను అభ్యర్థిగా పనిరానిప్పడు.. నేను చెప్పిన వారికి అభ్యర్థిగా ఎలా నిలబెడుతారు అంటూ నిలదీశారు. ఇలాంటి విషయాలు నమ్మద్దు.. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తర్వాతే బస్సు యాత్ర నిర్వహించాలని మంత్రి పెద్దిరెడ్డి అన్న చెప్పారని.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటా తప్పరని భావిస్తున్నాను.. తెర వెనుక ఏమైనా జరిగితే చెప్పలేం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.