Andhra Pradesh: టీడీపీకి ఏపీ సీఈవో ఎంకే మీనా లేఖ రాశారు.. గత నెల 23వ తేదీన టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్‌పై తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రత్యుత్తరం రాశారు.. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించాం. డిసెంబరు 9 తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12 తేదీలోగా పరిష్కరిస్తాం. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించాం. అందులో 5 లక్షల 64 వేల 819 పేర్లను అనర్హులుగా తేలింది. అన్ని జిల్లాల కలెక్టర్లూ ఆయా అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఓటర్లుగా ఆన్ లైన్ దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులూ వచ్చాయి. కాకినాడ నగరంలో ఫాం 7ల ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది ఎఫ్ఐఆర్ ను నమోదు చేశాం. ఈ వ్యవహారంలో పోలీసు స్టేషన్లలో అభియోగపత్రాలు కూడా దాఖలు అయ్యాయని లేఖలో పేర్కొన్నారు.
Read Also: Ponnam Prabhakar: కుల వృత్తులను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది
ఇక, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశపూర్వకంగా ఫాం 7లు దాఖలు చేసిన 6గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశామని లేఖలో వివరించారు సీఈవో.. పర్చూరులో 10 ఎఫ్ఆర్ లు నమోదు చేశాం. కావలి, గురజాల, బనగానపల్లె, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో ఫాం7 దరఖాస్తుల్లో వచ్చిన అభ్యంతరాలను తనిఖీ చేయించాం. చంద్రగిరి నియోజకవర్గంలో ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్ఓలపై చర్యలు తీసుకున్నాం.. జీరో డోర్ నెంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితా సవరించాం అన్నారు.
Read Also: History Of Khichdi: ఖిచ్డీ చరిత్ర వేల సంవత్సరాల నాటిది.. ఆ చక్రవర్తి అదంటే పడిచచ్చేవాడట
మరోవైపు.. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలూ విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదు అయ్యాయి. విశాఖలో 26 వేల మంది ఓటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 2,27,906 ఓటర్లకు సంబంధించి ఓటర్లు ఇతర పోలింగ్ కేంద్రాలకు మారింది. గందరగోళం లేకుండా ఈ జాబితాలను సవరించేందుకు కార్యాచరణ చేపట్టాం. ఓకే చోట 3 ఏళ్లు సర్వీసు పూర్తైన ప్రభుత్వ ఉద్యోగులు, క్రిమినల్ కేసులు నమోదైన వారు, ఈసీ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించిన అధికారుల ఎన్నికల విధుల్లో ఉండరు. ఓటర్ల జాబితా రూపకల్పనలో తప్పిదాలకు సంబంధించి ఇప్పటికే చర్యులు తీసుకున్నాం. ఉరవకొండ, ప్రొద్దుటూరు నియోజకవర్గాల ఈఆర్వోలు, పర్చూరు ఏఈఆర్వో, 1 సీఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని.. 50 మంది వరకూ బీఎల్వోలపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలిచ్చామని టీడీపీకి రాసిన లేఖలో వివరణ ఇచ్చారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా.. కాగా, ఏపీకి రానున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. రేపు కలవనున్నారు.. ఈ లోగా.. గతంలో చంద్రబాబు, టీడీపీ చేసిన ఫిర్యాదులు.. వాటిపై తీసుకున్న చర్యలపై ఈసీ వివరణ ఇచ్చింది.