MP Sri Krishna Devarayalu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది.. ఈ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తాను సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మాట వాస్తవమేనన్నారు.. అయితే, ఈసారి నరసరావుపేట నుండి కాదు గుంటూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం చెప్పిందన్నారు. కానీ, తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ఎంపీ స్పష్టం చేశారు.. పల్నాడులో చాలా పనులు సగం సగం మిగిలిపోయాయని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉందని అంటున్నారు ఎంపీ.. అధిష్టానం లెక్కలు అధిష్టానానికి ఉంటే, నా ఆలోచనలు వేరుగా ఉన్నాయని అంటున్నారు ఎంపీ కృష్ణదేవరాయలు. మొత్తంగా వేరే ప్రాంతంలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తానంటూనే.. ఆసక్తికర వ్యాఖ్యలుచేసిన నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..