నాగార్జున నగర్ లో 5.70లక్షలు రూపాయల నిధులతో అభివృధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం అయిందన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా ప్రజా ఆరోగ్యం భద్రత కల్పించిన జగన్.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన జగన్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. మానవ అభివృద్ధి కావాలి.. గ్రాఫిక్స్ అభివృధి ప్రజలకు ఏందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను.. బీసీలకు సముచిత స్థానం కల్పన జగన్ కే సాధ్యమన్నారు. టీడీపీలోనే బీసీలకు ఏం న్యాయం చేశారో చెప్పగలరా అని ఎంపీ కేశినేని నాని అడిగారు.
Read Also: Tantra Movie: పిల్లబచ్చాలు రావోద్దు.. ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల ‘తంత్ర’ పోస్టర్!
ప్రతీ డివిజన్ లో 20 కోట్లపై బడి అభివృద్ధి జరిగింది అని దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ హయాంలో గతుకుల రోడ్లు, నిండిన డ్రైనేజీలు వుండేవి అన్నారు. కొండ ప్రాంతంలో రైలింగ్, మెట్ల నిర్మాణం చేసిన ఘన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమం, అభివృధి ఆపొద్దు అని జగన్ చెప్పారు.. ఓ వర్గానికి చెందిన మీడియా ద్వారా టీడీపీ అసత్య ప్రచారం చేయటం బాధాకరం అని ఆయన చెప్పుకొచ్చారు. గత 10సం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి గద్దె ఏం అభివృద్ధి చేశారు.. మాజీ సీఎం చంద్రబాబు నియోజక వర్గంలో కూడా అనేక అభివృధి, సంక్షేమ పథకాలను జగన్ అమలు చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగుర వేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడించారు.