YV Subba Reddy: తుదిజాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV Subba Reddy: వైసీపీ అభ్యర్థుల గురించి ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ప్రస్తుతానికి సమన్వయకర్తలు మాత్రమేనని.. తుది జాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు అని ఆయన తేల్చి చెప్పారు. ఆఖరి సిద్ధం సభ తర్వాత అభ్యర్థుల తుది జాబితా, మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. సుదీర్ఘ కసరత్తు చేసే అవసరం చంద్రబాబుకు వచ్చిందంటేనే వైసీపీ అభ్యర్దులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీకి ఇప్పటికీ 40 స్థానాల వరకు అభ్యర్థులు లేరని వెతుక్కునే పనుల్లో ఉన్నారన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోంది.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
రాష్ట్ర భవిష్యత్ కోసం కాకుండా చంద్రబాబు కళ్ళలో బంగారు భవిష్యత్ చూడడానికే పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితం అయ్యారని వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. అరాచక అభ్యర్థులకు టికెట్ ఇచ్చే సంస్కృతి వైసీపీకి లేదన్నారు. మా వల్ల మేలు జరిగితేనే మళ్లీ మాకు ఓటు వేయమని చెప్పే ధైర్యం జగన్‌కు తప్ప ఇంకెవరికైనా ఉందా అంటూ ప్రశ్నించారు. షర్మిల వచ్చినంత మాత్రాన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్‌ను ఎవరూ పట్టించుకోరన్నారు. ఎన్ని కూటములు వచ్చినా అంతిమంగా విజయం వైసీపీదేనని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?