Gollapalli Surya Rao: టీడీపీ-జనసేన తొలి జాబితా కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి రాజేస్తోంది.. తొలి జాబితాలో సీటు దక్కనివారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. ఇక తనకు సీటు వచ్చే అవకాశం లేదని భావిస్తోన్న నేతలు.. పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. తెలుగుదేశం పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, చివరకు ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారట..
విజయవాడ వెళ్లిన గొల్లపల్లి సూర్యారావు.. ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని భవన్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డితో సమావేశం అయ్యారు.. ఈ భేటీలో టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ కండువా కప్పుకోవడానికి గొల్లపల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.. తన ముఖ్యఅనుచరులను ఎంపీ మిథున్ రెడ్డికి పరిచయం చేశారట.. మొత్తంగా.. గొల్లపల్లి సూర్యారావు.. టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ వైపు అడుగులు వేయడం వెనుక.. ఎంపీ కేశినేని నాని కీలకపాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది.. వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు.. ఈ రోజు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తారని తెలుస్తోంది.. అయితే, రాజోలు అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన గొల్లపల్లి.. ఈ స్థానం జనసేనకు వెళ్తుండంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు.. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు గొల్లపల్లి సూర్యారావు.