YSRCP: వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్.. పార్టీ బంపర్ ఆఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Focus on Vangaveeti Radha: ఎన్నికల వేళ.. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. వైసీపీలో అసంతృప్తులంతా ఎవరి దారి వారు చూసుకుంటుంటే.. టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ, జనసేనలో మొదలైన లుకలుకలను ఆయుధంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చేందుకు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రాధాతో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని మంగళవారం సమావేశమయ్యారు. వైసీపీలో చేరాలని, బందరు ఎంపీ సీటు రెడీగా ఉందని ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: Minister Dharmana Prasada Rao: అన్ని రంగాలలో జగన్ మార్పులు తెచ్చారు.. చర్చకు సిద్ధమా?
Also Read
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
ఇదిలా ఉండగా.. వైసీపీలో చేరికపై రాధా నుంచి క్లారిటీ రాలేదని సమాచారం. గతంలోనే రాధా వైసీపీలో చేరాలని పలు సమావేశాలు జరిపారు వైసీపీ కీలక నేతలు. టీడీపీ నుంచే రాధాకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నట్టు రాధా వర్గం చెబుతోంది. రాధాకి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరిగిన బెజవాడ సెంట్రల్, ఈస్ట్ టికెట్లను ఇప్పటికే చంద్రబాబు అనౌన్స్ చేయడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టికెట్ల ప్రకటనలతో రాజకీయం వేడెక్కుతున్న సమయంలో రాధాను కొడాలి నాని డైరెక్ట్‌గా పార్టీలోకి ఆహ్వానించడంతో.. ఏం జరగబోతోంది.. విజయవాడ పాలిటిక్స్‌లో సంచలనాలు చూడబోతున్నామా అనే చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!