YSR Rythu Bharosa: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు రైతుల వంతు వచ్చింది.. రైతులకు పెట్టుబడిసాయంగా.. వైఎస్సార్ రైతు భరోసా కింద సాయం అందిస్తున్న విషయం విదితమే కాగా.. వరుసగా ఐదో ఏడాది మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును ఈ రోజు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్.. దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించబోతున్నారు.. ఈ రెండు పథకాలకు అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Bitcoin : 26నెలల తర్వాత 56000వేల డాలర్లకు చేరిన బిట్ కాయిన్
కాగా, నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తూ వస్తుంది వైఎస్ జగన్ సర్కార్.. ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల బ్యాంకు ఖాతాల్లో ఈ రోజు రూ.1,078.36 కోట్లను జమ చేయనున్నారు.. మరోవైపు.. రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని చెల్లిస్తూ వస్తుంది ప్రభుత్వం.. రబీ 2021–22, ఖరీఫ్–2022లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును కూడా ఈ రోజు విడుదల చేయనున్నారు సీఎం జగన్.