Vasireddy Padma: ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడం చర్చగా మారింది.. ఎన్నికల తరుణంలో ఆమె ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? దీని వెనుక రాయకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు మొదలయ్యాయి.. అయితే, రాజీనామా వెనుక రాజకీయం లేదంటున్నారు వాసిరెడ్డి పద్మ.. రాష్ట్ర మహిళలందరికీ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గా రాజీనామా చేశానని వెల్లడించారు.. అయితే, ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన మాత్రమే రాజీనామాకి కారణం కాదు అని స్పష్టం చేశారు. పోటీ చేయడమే గీటు రాయి కాదు.. అలా అని కొందరు అనుకుంటూ ఉండచ్చు అన్నారు. బలా బలాల కారణంగా ఏమైనా అవకాశం ఉండకపోవచ్చు.. నాకు సీటొచ్చిందా లేదా అనేది ప్రాధాన్యత కాదు.. పార్టీ ఆదేశించినా ఆదేశించకపోయినా అన్నిటికీ సిద్ధమే అన్నారు వాసిరెడ్డి పద్మ..
Read Also: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్
ఇక, ఎన్నికల సమయంలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించడానికే ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు వాసిరెడ్డి పద్మ.. మహిళా సాధికారత ప్రతి ఇంటి దాకా చేరిందన్నారు. మహిళే అన్నిటికీ కేంద్రం అని చెపుతున్న ఈ ప్రభుత్వం ఉండాలి అన్నారు. మరోవైపు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారుగా..? పలానా నియోజకవర్గం గురించి అడిగారని ప్రశ్నించగా.. జగ్గయ్యపేట నా స్వస్థలం.. కనుక అక్కడ పోటీచేస్తా అనుకోవడం సహజం అన్నారు వాసిరెడ్డి పద్మ.
Read Also: AP Election Alliance: ఎన్నికల పొత్తులు.. అచ్చెన్న, నాదెండ్ల కీలక వ్యాఖ్యలు.
కాగా, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాసిన వాసిరెడ్డి పద్మ.. ”ముఖ్యమంత్రిగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతూ మీరు అమలు చేసిన పథకాలు, నిర్ణయాలు వారి పట్ల మీ నిబద్ధత రాష్ట్రానికి మాత్రమే కాదు.. దేశానికి మార్గ దర్శనం. మహిళా సాధికారతకు అర్థం చెప్పిన మీ పాలన గురించి ప్రచారం చేయాలని పేద ప్రజలు బాగుండాలంటే మీరు ముఖ్యమంత్రిగా కలకాలం ఉండాలని ప్రజల ముందు చెప్పాలనే సదుద్దేశ్యంతో ఎన్నికల ముందు నూతన బాధ్యతలు స్వీకరించాలని భావిస్తూ.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను.. ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ ఫిబ్రవరి 29వ తేదీ రాజీనామా చేశారు వాసిరెడ్డి పద్మ.