ప్రస్తుతం పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం ఉంది పోయింది. శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయఅంటున్న పోలీసులు వివరించారు. నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లే ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేసారు. బయట ప్రాంతాల వారు ఊరిలోకి రాకుండా అంక్షలు విధించారు అధికారులు. కేంద్రబలగాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసారు అధికారులు.
Also Read: Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
జెసి ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలని తాడిపత్రి నుంచి బయటకు అధికారులు పంపించివేశారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. తాడిపత్రిని యుద్ధభూమిగా మార్చారు కొందరు. తాడిపత్రిలోని చింతలరాయుని పాళెంలో ఉన్న వైస్సార్సీపీ ఏజెంట్లు దాడికి దిగారు. అంతలో టీడీపీ నాయకుడు అనుచరులు వైస్సార్సీపీ ఏజెంట్ సంజీవను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో సదరు ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి ‘నా వర్గీయుడినే ప్రశ్నిస్తారా?’ అంటూ తన అనుచరులతో టీడీపీ నాయకుడు ఇంటి వద్దకు వెళ్లి రాళ్లదాడికి దిగారు.
Also Read: Coolie : కూలీ కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ..?
ఆ తర్వాత స్పెషల్ కమాండెంట్ టీం బలగాలతో వెళ్లి అల్లరి మూకలను చెదరగొట్టారు. వైస్సార్సీపీ మూకల దాడిలో పట్టణ సీఐ మురళీకృష్ణ, కొందరు పోలీసుల అధికారులకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్లూ అందులో గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు వచ్చి పరామర్శించారు. ఆ తర్వాత టీడీపీ వర్గీయులు పెద్దారెడ్డి అరాచకాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేయగా.., అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు. అక్కడ దాడికి పక్కా వ్యూహంతో ఉన్న వైస్సార్సీపీ వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లను తెప్పించి మరీ టీడీపీ వారిపైకి రాళ్లు విసిరారు. టీడీపీ వర్గీయులపై బాణసంచా పేల్చారు.