ఉదయం నుంచి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు స్పష్టంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారని.. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు.
తెనాలి ఐతానగర్లో నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ రోజు ఉదయం వెళ్లాం అని తెలిపిన అన్నాబత్తుని శివకుమార్.. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నానా దుర్భాషలాడాడు.. నా భార్య ముందే నన్ను అసభ్యంగా దూషించాడు. బూత్లోకి వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడు అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో క్రమంగా ఓటింగ్ శాతం నమోదు అవుతోంది.. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. క్రమంగా పుంజుకుంది.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది..
పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. సహనం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యే శివ కుమార్ కు, ఓటర్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఓటర్ పై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేయి చేసుకున్నాడు.. ఆ వెంటనే ఎమ్మెల్యే శివ కుమార్ చంపపై తిరిగి ఓటర్ దాడి చేశాడు.
విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసేందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఎన్నికల సమయంలో అనేక దుష్ప్రచారాలకు తెర లేపుతున్నారని మండిపడ్డారు.