రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజార్టీ సాధించిన కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా గద్దెనెక్కారు. కాగా.. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల ఇళ్లపై కూటమి పార్టీల కార్యకర్తలు ఎగబడుతున్నారు.
జగన్.. తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లకు రూ.50 కోట్ల ప్రభుత్వ ధనంతో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. " సీఎం హోదాలో తాను తీసుకున్న ఫర్నిచరును జగన్ తిరిగి అప్పగించ లేదు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే వరుస సమావేశాలు పెట్టి అభ్యర్థులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చిస్తున్నారు. అయితే, నేడు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కావాలని ఆదేశాలు అందాయి.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే త్వరలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకోబోతున్నారు.