Mudragada Daughter: ముద్రగడపై కూతురు ఘాటు వ్యాఖ్యలు.. పేరు మార్చుకున్నారు.. కానీ..!
- ముద్రగడపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన కూతురు క్రాంతి
- ఆయన పేరు మార్చుకున్నారు.. కానీ ఆలోచానా విధానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉంది
- శేషజీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా
- మళ్లీ పవన్ ను విమర్శిస్తే.. నేను గట్టిగా ప్రతిఘటిస్తాను అని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Daughter: కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. సార్వత్రిక ఎన్నికల సమయంలో చేసిన సవాల్ మేరకు తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.. ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం.. అయితే, సొంత కూతురే ముద్రగడపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ముద్రగడ కుమార్తె క్రాంతి..
Read Also: Apple School Sale 2024: ‘యాపిల్’ స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌లపై భారీ డిస్కౌంట్!
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
‘మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని, అయన ఆలోచానా విధానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉందని మండిపడ్డారు క్రాంతి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏనాడూ ప్రశ్నించని ఆయనకు పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. ఒకసారి, తనపేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాక, కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువత భవిష్యత్ ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ విషయం ఆయనకు ఎందుకో అర్ధం కావడం లేదన్నారు.. పవన్ కళ్యాణ్ ఏమి చేయాలో ఆయనకు స్పష్టత ఉంది. ఏమి చేయాలో మా తండ్రి గారికే స్పష్టత లేదు అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. శేషజీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా ఒక కూతురుగా సలహా యిస్తున్నాను.. మళ్లీ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే, నేను గట్టిగా ప్రతిఘటిస్తాను” అని హెచ్చరిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్‌లో నిలదీశారు ముద్రగడ కూతురు క్రాంతి. కాగా, సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ముద్రగడ వ్యాఖ్యలు చేస్తూ రాగా.. ఆయనకు వ్యతిరేకంగా ఆయన కూతురు క్రాంతి గొంతు విప్పిన విషయం విదితమే.
మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని ,అయన అలోచానా విదానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉన్నది.
జగన్ మోహన్ రెడ్డి గార్ని ఏనాడూ ప్రశ్నించని అయన , పవన్ కళ్యాణ్ గార్ని ప్రెశ్నించే అర్హత ఆయనకు ఉందా?
ఒకసారి,…
— Kranthi Barlapudi (@kr_barlapudi) June 21, 2024
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..