అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సెట్చేసుకునే పనిలో పడిపోయింది.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు పార్టీ నేతలతో భేటీలు అవుతూనే.. మరోవైపు అధికారులపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించడం.. వెంటనే ఆయన సెలవుపై వెళ్లడం జరిగిపోయాయి.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై ప్రజా తీర్పు కచ్చితంగా రిఫరెండమే అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందించారు.. అయితే, మూడు రాజధానులు అని ప్రకటించినా.. అమరావతికి మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అమరావతితో పాటు వైజాగ్ నగరం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి…
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చినా.. ఎందుకు ప్రజల ఆదరణ లభించ లేదో తేల్చుకోవాలన్నారు. వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు, సంస్కరణల కారణంగా పార్టీ కేడర్ కు గౌరవం దక్క లేదు.. నాయకత్వం, కేడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా.. ప్రభుత్వం - పార్టీ మధ్య దూరం పెరిగిందన్నారు.
Kurnool District: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరు ఉహించనటువంటి ఫలితాలు చూసారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని అందుకున్నారు. కానీ కర్నూల్ జిల్లాల కుటుంభ రాజకీయాలను పలు మలుపులు తిప్పాయి. గత కొన్ని సంవత్సరములుగ ఉమ్మడి కర్నూల్ జిల్లాల్లో కుటుంభ రాజకీయాలు నడుస్తున్నాయి. కొన్ని కుటుంబాలు రాజకీయంగా బలపడితే మరికొన్ని కోలుకోలేని దెబ్బ తిన్నాయి. 2019 ఎన్నికల్లో 4 ప్రధాన కుటుంబాలకు రాజకీయంగా కోలుకోలేని విధంగా కనుమరుగు అయ్యారు. మల్లి…
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలలో వైసీపీ అధికారంలోకి రాగా.. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తేరుకోలేకపోతున్నారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. ప్రజల తీర్పుతో ఆశ్చర్యం కలుగుతోంది.. బాధ కూడా కలుగుతోందన్నారు.
నేడు వెలుబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని., ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నాడు. అలాగే వారిలాగా తాము కక్షలు సాధించే ప్రభుత్వం మాది కాదని ఆయన తెలిపారు. అలాంటి ప్రభుత్వం నడిపే ఉద్దేశం మాకు లేదని చెప్పుకొచ్చారు. వాళ్లు చేసిన పొరపాట్లు తాము చేయుమని.. మాది ఒకే రాజధాని సిద్ధాంతమని లోకేశ్ పేర్కొన్నారు. Anam…