Ys Jagan Tweets about Situation in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది, టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది అని ఆరోపించిన ఆయన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని అన్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు…
ఏపీలో వైసీపీ ఓటమిపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్పందించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు జగన్ అందించారని.. ఎక్కడ ఏమి జరిగిందో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మాణమవుతున్న రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. శిలాఫలకంపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ భరత్ రామ్ పేరుతో పాటు బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు ఉన్నా పట్టించుకోకండా టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. గుడ్‌బై చెప్పారు.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు రావెల కిషోర్‌బాబు..
ప్రొద్దుటూరు వాసుల ప్రజాతీర్పును గౌరవిస్తాను అన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా ప్రజాలకోసమే పాలన చేశా.. ఉద్యోగస్తుల విషయంలో వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే వచ్చాను.. ప్రతీ ఉద్యోగస్తులకు నా కృతజ్ఞతలు అన్నారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుతం జగన్ క్యాంపు కార్యాలయమును వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించింది. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక టీడీపీ నేతలు బీహార్ తరహా హింసా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేశారు.
మంగళవారం నాడు వెలువడిన ఎన్నికల రిజల్ట్స్ లో టీడీపీ కూటమి భారీ విజయన్ని అందుకుంది. ఇకపోతే గత ఏడాది పార్టీలు మారిన అభ్యర్థులందరూ ఎన్నికల్లో ఓడిపోగా ఈసారి మాత్రం పార్టీలు మారిన అభ్యర్థులందరూ గెలవడం విశేషం. 2024 ఎన్నికల నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్సిపి నుండి టిడిపిలోకి చేరిన వారంతా విజయాన్ని సాధించారు. అలాగే వైఎస్ఆర్సిపి నుండి జనసేనలో మారిన వారు కూడా విజయనందుకున్నారు. అయితే టిడిపి నుంచి వైసీపీకి వెళ్లిన వారు, బిజెపి నుంచి వైసీపీకి వచ్చిన…
ఎన్నికలు ముగిశాయి.. అందరూ చాలా కష్టబడ్డారని.. మా ఓటమిని అంగీకరిస్తున్నామని తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి చేసుకొచ్చామని.. అయితే మరి కొన్ని మిగిలి ఉన్నాయని, వాటిని కొనసాగించాలని మా అభిప్రాయాన్ని చెబుతున్నామన్నారు.