వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి రెండ్రోజులపాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తొలిసారి ఆయన పులివెందులకు వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నాం తాడేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రం కల్లా అక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి.. ఆయన భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నాం కల్లా పులివెందుల పర్యటనను ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారాయన.
టీడీపీ గతంలో చాలా కష్టాలు, ఒడిదొడుకులు ఎదుర్కొందని, నిద్ర లేని రాత్రులు గడిపామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన టీడీపీ నేతలు మాట్లాడలేకపోయేవారని గుర్తు చేసుకున్నారు.
రాష్ట్రానికి మంత్రి అయినా అనంతపురం జిల్లాకు కూలీగా పని చేస్తానని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న పయ్యావుల కేశవ్కు సోమవారం మండలంలోని బాట సుంకులమ్మ ఆలయ సమీపంలో ఘన స్వాగతం లభించింది.
ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్కు రాజీనామా లేఖను పంపారు.
ఇందిరాగాంధీని “భారతమాత” అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వివరణ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని “భారతమాత” అని కేంద్రమంత్రి సురేష్ గోపీ శనివారం వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీకి ‘తల్లి’ అని అన్నానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈరోజు మీడియాకు తెలిపారు. తాను హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తినని.. ఇందిరా గాంధీ గురించి తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా… కేరళలో…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజార్టీ సాధించిన కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా గద్దెనెక్కారు. కాగా.. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల ఇళ్లపై కూటమి పార్టీల కార్యకర్తలు ఎగబడుతున్నారు.
జగన్.. తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లకు రూ.50 కోట్ల ప్రభుత్వ ధనంతో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. " సీఎం హోదాలో తాను తీసుకున్న ఫర్నిచరును జగన్ తిరిగి అప్పగించ లేదు.