స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం ప్రజల భాగస్వామ్యం కోసం అభిప్రాయ సేకరణ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. యాభై వేల ప్రజల నుంచి విభిన్న ఆలోచనలతో అభిప్రాయ సేకరణ జరిగిందని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కమర్షియల్ క్రాప్స్ పండించే రైతన్నకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న వేళ.. దువ్వాడ మాధురితో కలిసి తిరుమలకు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్.. నిన్నటికి నిన్నే దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై.. తన ఇంటి ఆవరణలో చక్కర్లు కొచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంబటి రాంబాబు.... ఏపీ పాలిటిక్స్ మీద కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా....అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. మంత్రి హోదాలో మాట్లాడినా, వైసీపీ ప్రతినిధిగా మైకందుకున్నా... తన వాగ్ధాటితో ప్రత్యర్థుల మీద విరుచుకుపడే అంబటి... ప్రస్తుతం కొత్త చిక్కుల్లో పడ్డారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట.
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. టీటీడీ లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతిస్తుందన్న ఆయన.. టీటీడీ విషయంలో గతంలో అధికార పార్టీని బీజేపీ నిలదీయటం జరిగింది .. అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి రథం తగలపెట్టిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. హిందూ వ్యతిరేక దాడులు గత ప్రభుత్వంలో చాలా జరిగాయి..
త్రేతాయుగం నుంచి సనాతన ధర్మం నడుస్తోంది.. నేడు సనాతన ధర్మాన్ని తానే కనిపెట్టినట్లు పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి.. సనాతన ధర్మం గురించి ఎవరు కించపరిచిన దాఖలాలు లేవు.. సనాతన ధర్మం పవన్ కు ఎందుకు గుర్తొచ్చింది..? గతంలో కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టేవారు.
Bhumana Karunakar Reddy: గత 14 ఏళ్లలో ఎప్పుడు పవన్ కల్యాణ్ ఆయన కుమార్తెలకు దర్శనానికి తీసుకుని రాలేదు అని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మంలో పసిబిడ్డలకు తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ.. కానీ అది ఎప్పుడు చేయలేదు.. పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. పవన్ సినిమాలో ఓ పాట పాడుతూ సెటైర్ వేసినా భూమన.. డిక్లరేషన్ సభ పేరుతో జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.
Varahi Declaration: తిరుపతిలో వారహి డిక్లరేషన్ బహిరంగ సభలో సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పని చేస్తాయి..
Satya Prasad: అధికారం లేక పిచ్చి పట్టినట్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు.. అందుకే అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం.. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడగలిగాలి.. అప్పుడే ప్రజల ఆశీస్సుల ఉంటాయి.