విజయనగరం జిల్లా పర్యటనలో ప్రభుత్వంపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను.. డయేరియాతో ఆస్పత్రిపాలైనవారిని పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.. కూటమి హయాంలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం అయ్యింది.. 14 మంది డయేరియాతో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు..
పిలిచి పిల్లనిస్తామంటే పెళ్ళి కూతురు గురించి తేడాగా మాట్లాడినట్టు ఉందట అక్కడి వ్యవహారం. వైసీపీ అధిష్టానం ఏరికోరి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే.... తీరా ఓడిపోయాక ఉన్నారో లేరో కూడా అడ్రస్ లేకుండా పోయారా నేతలు. భరోసా ఇచ్చే లీడర్ లేక కేడర్ కూడా కన్ఫ్యూజ్లో ఉందట. అంత తేడాగా ప్రవర్తిస్తున్న ఆ లీడర్స్ ఎవరు? ఎందుకలా జరుగుతోంది?
మరో కీలక నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. వైసీపీకి ఇవాళ రాజీనామా చేయనున్నారు వాసిరెడ్డి పద్మ.. గ న్నికల్లో జగ్గయ్యపేట సీటు ఆశించారు వాసిరెడ్డి పద్మ.. అయితే, ఇటీవల తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం.. ఇక, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయానికి వచ్చారనే చర్చ సాగుతోంది..
కూటమి ప్రభుత్వం పాలన మహిళలకు చీకటి కాలమని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కారణం ఎవరు.. నేరస్థులకు ఇంత ధైర్యం ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేయటం లేదని ఆమె ఆరోపించారు. చంద్రబాబు కూటమి బలాన్ని ఎందుకు వాడుకుంటున్నారు.. అధికారులపై ఒత్తిడి తేవడం కోసం వాడుకుంటున్నారని శ్యామల అన్నారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాత కేబినెట్, ఎమ్మెల్యేల సమావేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి మాటగా చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రభుత్వం కాలం రెండున్నర ఏళ్లు అని అర్థం అవుతుందన్నారు. అందుకే సంక్రాంతి వరకు కూటమి ప్రభుత్వానికి సమయం ఇద్దామనే మా ఆలోచన మార్చుకున్నామన్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో హ్యాపీగా లేరా? పార్టీలో తన పొజిషన్ ఏంటో అర్ధంగాక క్వశ్చన్ మార్క్‌ను ఇంకా తీసేయలేకపోతున్నారా? అదే సమయంలో బాలినేని స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ని వైసీపీ ఎందుకు ప్రకటించలేదు? ఈ పరిణామాలన్నిటినీ సింక్ చేస్తూ…. ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ మధ్య ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. రెండేళ్ల ముందు వరకూ…
5 నెలల చంద్రబాబు పాలనలో డీబీటీ ఎక్కడ మచ్చుకైనా కనపడటం లేదని.. డీపీటీ మాత్రమే కనిపిస్తోందని.. డీపీటీ పాలన అంటే దోచుకో పంచుకో తినుకో మాత్రమే చంద్రబాబు పాలనలో ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. సూపర్ సిక్స్ లేదు సూపర్ 7 కూడా లేదన్నారు. ప్రజలు నిలదీస్తారని భయపడి కనీసం బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదేనంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దేశంలో ఈ విధానం ఓటాన్ బడ్జెట్ నడుపుతున్న ప్రభుత్వం ఇదేనన్నారు.
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుకుంటున్నాయా..? అంటే అవును అన్నట్టుగానే ఉంది పరిస్థితి.. మొన్న నంద్యాలలో విజయ డైరీ చైర్మన్ తో వివాదం, నిన్న విజయ డైరీ చైర్మన్ రియాక్షన్, ఇవాళ భూమా అఖిల సోదరుడు భూమా విఖ్యాత హాట్ కామెంట్స్, మరో వైపు టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఎంట్రీతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ మొదలైంది..
టీడీపీ కార్యాలయంపై దాడి కేసును అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొ్న్నారు. ప్రతిక్షంగానూ, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగానూ పార్టీ ఉందన్నారు. అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగిందన్నారు. కాకపోతే మనం ఆర్గనైజ్డ్గా యుద్ధంచేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది…