మరోసారి తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకున్న ఆయనకు.. వైసీపీ నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వత ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఇడుపులపాయ గెస్ట్ హౌస్లో వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం…
జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ పాలనలో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్ల రూపాయాలు కేటాయించి 96 శాతం ఖర్చు చేశాం.. కానీ, గత ఐదేళ్లలో జగన్ పాలనలో 3,518 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం 170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఎంపీ మిథున్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.. పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. అయితే, ఈ రెండు కేసుల్లో ఎంపీ మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఏపీ హైకోర్టు.
సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణులకు వైసీపీ కీలక సూచనలు చేసింది.. డైవర్షన్ పాలిటిక్స్ తిప్పికొడదాం.. ప్రజా గొంతుకై నిలుద్దాం అంటూ.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది..
సింహపురిలో ఫ్యాన్ రెక్కలు వేటికవే వంగిపోయి తిరుగుతున్నాయా? బెండ్ తీసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నా.. ససేమిరా అంటున్నాయా? ఫ్యాన్ రిపేరవక కేడర్ ఉక్కపోతగా ఫీలవుతోందా? ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? అధికారంలో ఉన్నప్పుడు అట్లున్న పార్టీ ఇప్పుడెట్లా అయిపోయింది? నేతల మనసులు కలవబోమంటున్నాయా? ఏపీలో ఒకప్పుడు వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు ఒకటి. 2014 ఎన్నికల్లో రాష్ట్ర మంతటా టిడిపి గాలి వీచినా నెల్లూరులో మూడు సీట్లకే పరిమితం అయింది. ఇక 2019లో…
వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికుండగానే జగన్, షర్మిలకు సమానంగా ఆస్తి పంపకాలు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్కు బెంగుళూరులో ఇల్లు ఉందని షర్మిలకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇల్లు ఇచ్చారని వెల్లడించారు. వివాహం అయినా తర్వాత షర్మిల వాటాలు తీసుకొని మళ్ళీ ఆస్తులు కోరడం సమంజసం కాదన్నారు.
పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని స్పష్టం చేశారు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కడపలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోసమావేశమయ్యారు రెండు జిల్లాల ముఖ్య నాయకులు.. పార్టీ బలోపేతంపై చర్చించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించాం.. జిల్లా, మండల స్థాయిలో పార్టీ కార్యవర్గాన్ని సిద్ధం చేస్తున్నాం.. నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి పార్టీ పోస్టుల్లో నియామకాలు చేస్తున్నాం అన్నారు..
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. ఏదైనా ఇష్యూ జరిగితే డైవర్షన్ ఎలా చేయాలో చూస్తున్నారు తప్పా పని చేయరు అని దుయ్యబట్టారు.. ప్రతి ఇంట్లో ఉన్న గొడవలే మా ఇంటిలో కూడా ఉన్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్.. కానీ, నేను గుర్ల వస్తున్నానని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంత చేశారు.. నా ఫోటో.. నా చెల్లి ఫోటో.. మా అమ్మ ఫోటో పెడతారు.. మీ ఇళ్లలో ఇలాంటి…