వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.. వరద సాయంపై చర్చకు రావాలని సవాల్ చేశారు.. వరద సాయంపై చర్చించడానికి మేం సిద్ధం.. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా..? అని చాలెంజ్ చేశారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇప్పటికే రాజీనామా చేసిన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు టీడీపీ గూటికి చేరనున్నారు.. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇక, ఈ ఇద్దరు మాజీ ఎంపీల వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా టీడీపీ కండువాకప్పుకుంటారని తెలుస్తోంది..
జమ్మలమడుగులో కొత్త జాతర మొదలైంది! అదేనండీ.. పొలిటికల్ జాతర! ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క..! అన్నొచ్చాడని చెప్పండని ఆయన తొడగొడుతున్నాడు! ఇన్నాళ్లున్న సైలెంటుగా ఉండి ఇప్పుడొక్కసారిగా జై జమ్మలమడుగు అన్నాడు. మరి ఇంతకాలం చక్రం తిప్పిన ఇంకో లీడర్ ఎక్కడ? ఆయన ఎటు వెళ్లారు? రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గెలస్తారు.. ఓడుతారు! ఫీల్డులో ఉండాలి.. ఫైట్ చేయాలి! ఎవరైనా ఇదే సూత్రంతో రాజకీయాలు నడుపుతుంటారు. కానీ జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డికి…
స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం ప్రజల భాగస్వామ్యం కోసం అభిప్రాయ సేకరణ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. యాభై వేల ప్రజల నుంచి విభిన్న ఆలోచనలతో అభిప్రాయ సేకరణ జరిగిందని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కమర్షియల్ క్రాప్స్ పండించే రైతన్నకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న వేళ.. దువ్వాడ మాధురితో కలిసి తిరుమలకు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్.. నిన్నటికి నిన్నే దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై.. తన ఇంటి ఆవరణలో చక్కర్లు కొచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంబటి రాంబాబు.... ఏపీ పాలిటిక్స్ మీద కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా....అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. మంత్రి హోదాలో మాట్లాడినా, వైసీపీ ప్రతినిధిగా మైకందుకున్నా... తన వాగ్ధాటితో ప్రత్యర్థుల మీద విరుచుకుపడే అంబటి... ప్రస్తుతం కొత్త చిక్కుల్లో పడ్డారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట.
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. టీటీడీ లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతిస్తుందన్న ఆయన.. టీటీడీ విషయంలో గతంలో అధికార పార్టీని బీజేపీ నిలదీయటం జరిగింది .. అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి రథం తగలపెట్టిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. హిందూ వ్యతిరేక దాడులు గత ప్రభుత్వంలో చాలా జరిగాయి..
త్రేతాయుగం నుంచి సనాతన ధర్మం నడుస్తోంది.. నేడు సనాతన ధర్మాన్ని తానే కనిపెట్టినట్లు పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి.. సనాతన ధర్మం గురించి ఎవరు కించపరిచిన దాఖలాలు లేవు.. సనాతన ధర్మం పవన్ కు ఎందుకు గుర్తొచ్చింది..? గతంలో కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టేవారు.
Bhumana Karunakar Reddy: గత 14 ఏళ్లలో ఎప్పుడు పవన్ కల్యాణ్ ఆయన కుమార్తెలకు దర్శనానికి తీసుకుని రాలేదు అని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మంలో పసిబిడ్డలకు తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ.. కానీ అది ఎప్పుడు చేయలేదు.. పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. పవన్ సినిమాలో ఓ పాట పాడుతూ సెటైర్ వేసినా భూమన.. డిక్లరేషన్ సభ పేరుతో జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.