CM Jagan : జాగ్రత్త ఇంటికి వెళ్లండి.. మీ అన్నగా సలహా ఇస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు వేదికగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు రెండో రోజు ప్లీనరీ ముగింపు సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తాం.. చంద్రబాబు పార్టీకి డిపాజిట్ కూడా రాదు.. మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలు కావు. ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగింది.. సైకిల్ చక్రాలు ఊడిపోయాయి.. చక్రాలు ఊడిన సైకిల్‌ను తండ్రీకొడుకులు తొక్కలేకపోతున్నారు.. అందుకే దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగింది. సైకిల్ చక్రాలు ఊడిపోయాయి. మనకు వెన్నుపోటు ద్వారా అధికారం తీసుకోవాడం రాదు. కౌర సైన్యాన్ని ఓడించడంలో కార్యకర్తలదే అర్జునుడి పాత్ర. కుప్పం మున్సిపాల్టీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్ స్వీప్ చేశాం. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని అంటున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ అమెరికా అయ్యిందా..? తెలుగుదేశం పార్టీ, ఎల్లోమీడియా చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సోషల్ మీడియా తిప్పికొట్టాలి. గ్రామాల్లో కూడా సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేయాలి. ప్రజల్లోకి వెళ్లి మన ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించి మద్దతుగా నిలువాలని దీవెనలు తీసుకోవాలి.
ఎన్నికలకు సన్నద్ధం కావాలి. ఇంటింటికి జరిగిన మేలును చెబుతున్నప్పుడు అవి వెంటనే పరిష్కరించేలా.. పార్టీ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ.. కార్యకర్తలు, అభిమానులు చొరవ చూపాల్సిందిగా కోరుతున్నాను. 2009లో సంఘర్షణలో మొదలైనప్పటి నుండి మీరు నావెంటే ఉన్నారు. జెండాను భుజానికెత్తుకున్నారు. అన్నగా అప్యాయత చూపించారు. తమ్ముడిగా తోడుగా నిలబడ్డారు. బిడ్డగా దీవించారు. 2019లో పార్టీకి చారిత్రాత్మక విజయం సాధించి పెట్టడంతో పాటు. ఈ తరువాత జరిగి ప్రతి ఎన్నికల్లో కూడా దుష్టచతుష్టయం చెవులు చిల్లులు పడేలా విజయఢంకా మోగించింది అంటే.. దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులతో పాటు.. లక్షల మంది కార్యకర్తల అవిశ్రాంత కృషి అని కూడా సగర్వగంగా తెలియజేస్తున్నాను. చాలా మందైతే రేపు బక్రీద్ పండుగా ఉన్నాకూడా.. ఆ పండుగను సైతం పక్కనపెట్టకూడా ఆశీర్వదించడానికి వచ్చారు. మీ చెరగని చిరునవ్వులను నా గుండెల్లో పెట్టుకుంటాను. మీ అప్యాయతలే జగన్‌ను ఇంతవాడిని చేశాయ్.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
రేపొద్దున జగన్ మరింతగా ఎదుగుతాడంటే అది కేవలం మీ అండదండలతోనే అని సగర్వగంగా తెలియజేస్తున్నా.. మీ అందరి దీవెనలు.. దేవుడి దయ ప్రజలందరి ఆశీస్సులు.. సదా మనకు. మీ జగనన్నకు ఎప్పుడూ ఉండాలని సవినయపూర్వకంగా కోరుకుంటూ.. ఎంతో దూరం.. ఎంతో అభిమానంతో ప్లీనరీ వచ్చివారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరింత ఆత్మవిశ్వాసంతో.. సురక్షితంగా మీ ఇళ్లకు మీరు చేరుకోవాలని.. వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్లండని మీ అన్నగా మీకు సలహా ఇస్తూ.. కాస్త ఆలస్యమైన పరవాలేదు నెమ్మది వెళ్లండని సలహా ఇస్తూ.. దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులు మన పార్టీపైన ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!