వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ వేదికగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు.. 2024 టార్గెట్‌గానే ఈ ప్లీనరీ ఉంటుందని తెలిపారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావొచ్చాయి.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సమావేశాలు సాగనున్నాయి..
ఈనెల 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు వైసీపీ ప్లీనరీ అజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఈనెల 8న ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10:10 గంటలకు పార్టీ జెండాను వైసీపీ…