డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర వివరాలను తెలిపారు. పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరామని ఆమె వెల్లడించారు. నర్సంపేటలో టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని.. దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టారని ఆమె ఆరోపించారు.
నిర్మల్ జిల్లాలో YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. కేసీఅర్ పై విమర్శలు గుప్పించారు. దళిత బందు ను కాస్తా అనుచరుల బందు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల చూపు మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీ నుంచి బరిలో దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.. పలువురి పేర్లు తెరపైకి వస్తున్నా.. అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించింది లేదు.. మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ సభ వేదికగానే అభ్యర్థి పేరు ప్రకటిస్తారని అంతా భావించినా.. అభ్యర్థి…
నేడు గవర్నర్ తమిళిసై ను వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న వైఎస్ షర్మిల. నేడు గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర ఎల్లుండికి వాయిదా పడింది. రేపు (మంగళవారం) వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. read also: Astrology: ఆగస్ట్…
ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ ఫొటో పెట్టుకుని ఎంతో మంది గెలిచారని.. మంత్రి పువ్వాడ అజయ్‌కు ఆయన్ను విమర్శించే స్థాయి లేదని చెప్పారు. తనకు బయ్యారం మైనింగ్‌లో వాటా ఉన్నట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంలో తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మంత్రిగా ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటూ తన బిడ్డలపై ప్రమాణం చేసే ధైర్యం పువ్వాడకు ఉందా? అని ఆమె సవాల్ విసిరారు. ఆయన మెడికల్ కాలేజీకి…