YS Sharmila: రాజా సింగ్ ఒక కమెడియన్.. ఇదంతా కేసీఆరే నడిపిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila Fires On MLA Raja Singh Issue: ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రాజా సింగ్ ఒక కమెడియన్ అని.. ఎమ్మెల్యే స్థాయి చేతకాకపోతే కమెడియన్‌గా ఉండండని హితవు పలికారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ఆ చిచ్చులో చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నో మతాలకు, ఎన్నో సంప్రదాయాలకు నిలయమైన రాష్ట్రమని.. ఇలా ప్రశాంతంగా ఉంచడం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. బీజేపీ ఒక మత పార్టీ, మత పిచ్చి ఉన్న పార్టీ అని రుజువైందని అన్నారు. మతం పేరు చెప్పి, రాజకీయం చేస్తారని నిరూపితమైందని చెప్పారు.
ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడని మాటలు విన్నామని.. ఎమ్మెల్యే అంటే ఒక నియోజక వర్గ ప్రజలకు, అన్ని కులాలు, మతాల వారికి ఎమ్మెల్యే అని షర్మిల అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా రాజా సింగ్ మాట్లాడటం సరి కాదన్నారు. అతనిపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుందో క్లారిటీ లేదన్న ఆమె.. సస్పెండ్ చేశాం, షో కాజ్ నోటీస్ ఇచ్చామని బీజేపీ అంటోందని, సస్పెండ్ చేస్తే క్లియర్‌గా చెప్పాలని బీజేపీని అడిగారు. షో కాజ్ నోటీస్ అంటే.. వివరణ ఇచ్చుకో అని చెప్తున్నారా?అంటూ నిలదీశారు. గతంలో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడుగా ఉండి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. మసీదులు తవ్వుకుంటూ పోదాం.. శవాలు వస్తె మీవి.. శివ లింగాలు వస్తె మావి అన్నారని.. అయినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. రాజా సింగ్ కూడా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఆయన ముస్లిం మతాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారని చెప్పారు. బీజేపీకి ఓట్లు వేయకపోతే బుల్డోజర్‌తో నాశనం చేస్తానని రాజా సింగ్ అన్నారని.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలా ఆయనిలా మాట్లాడుతున్నారని అన్నారు.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
ఒక మతాన్ని సైడ్ తీసుకొని బీజేపీ ఒకవైపే ఎలా మాట్లాడుతుందని షర్మిల ఫైరయ్యారు. ఓల్డ్ సిటీలో మళ్ళీ చిచ్చు పెడుతున్నారని, ఇదేనా బీజేపీకి చేతనైన రాజకీయమని ప్రశ్నించారు. రాజా సింగ అంశాన్ని గవర్నర్ చాలా సీరియస్‌గా తీసుకోవాలని, స్పీకర్ కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వాళ్ళను సమాజం సహిస్తే గొడవలు పెరుగుతూ ఉంటాయని హెచ్చరించారు. వైఎస్సార్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, కేసీఅర్ మాత్రం ముస్లింలను ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి ఫెయిలయ్యారన్నారు. కవిత లిక్కర్ వ్యాపారాన్ని మళ్లించడానికి కేసీఆర్ ఈ రాజా సింగ్ అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజా సింగ్ వెనుక కేసీఅర్ ఉన్నారని చర్చ జరుగుతోందని, డైవర్షన్ స్కీమ్ కింద రాజా సింగ్ ఎపిసోడ్ తీసుకొచ్చారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మతాలు పేరు చెప్పి రాజకీయం చేయండి కానీ.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను మాత్రం రాజకీయాలకు వాడుకోకండని షర్మిల హితవు పలికారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!