నేడు గవర్నర్ తమిళిసై ను వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న వైఎస్ షర్మిల. నేడు గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర ఎల్లుండికి వాయిదా పడింది. రేపు (మంగళవారం) వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.
read also: Astrology: ఆగస్ట్ 08, సోమవారం, దినఫలాలు
తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయం మొదలు పెట్టిన వైయస్ షర్మిల ఏ పోరాటం చేసిన పకడ్బందీగా.. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అయితే.. గతంలో నిరుద్యోగుల సమస్యల పోరాటానికి నిరుద్యోగ నిరాహారదీక్షను ప్రారంభించారు. ఈనేపథ్యంలో.. ప్రతి మంగళవారం నేటికీ నిరుద్యోగ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు వై.ఎస్. షర్మిళ. ఈనేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాటల బాణాలను ఎక్కుపెడుతు ప్రశ్నలు సంధిస్తున్నారు.
అయితే.. తాజాగా ఇటీవల కురిసిన వరదలకు కాళేశ్వరం పంప్ హౌస్ లు మునిగిపోవడం.. ఆ తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టు సంస్థ మేఘ కంపెనీ నిర్లక్ష్యం వల్ల ఐదుగురు కూలీలు మృతి చెందడం వంటి ఘటనలపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ పై కొత్త సమరానికి రెడీ అయ్యారు. అయితే కెసిఆర్, మేఘా కృష్ణారెడ్డి ఇద్దరూ ఆర్థిక లావాదేవీల విషయంలో భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్న వైయస్ షర్మిల మేఘా కృష్ణారెడ్డిని దోషిగా నిలబెట్టక పోవడం వెనుక కెసిఆర్ కు అందుతున్న ముడుపులే కారణమని ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. నేడు వైఎస్ షర్మిళ, గవర్నర్ తమిళిసై ని కలవనున్న నేపథ్యంలో.. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
IND vs WI: వెస్టిండీస్‌పై గ్రాండ్ విక్టరీ.. భారత్ ఖాతాలో మరో సిరీస్..