తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల చూపు మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీ నుంచి బరిలో దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.. పలువురి పేర్లు తెరపైకి వస్తున్నా.. అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించింది లేదు.. మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ సభ వేదికగానే అభ్యర్థి పేరు ప్రకటిస్తారని అంతా భావించినా.. అభ్యర్థి పేరు చెప్పకుండానే తన ప్రసంగాన్ని ముగించారు గులాబీ బాస్.. ఇప్పుడు మరోపార్టీ మునుగోడు బరిలో దిగేందుకు సిద్ధమైంది.. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కూడా మునుగోడు ఉప ఎన్నికల బరిలో తన అభ్యర్థిని పెట్టేందుకు రెడీ అయినట్టు.. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి..
Read Also: Komatireddy Venkat Reddy: ప్రియాంకా గాంధీతో భేటీ.. ఆ అంశంపై చర్చించాం
వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 131వ రోజుకు చేరింది.. యాత్రలో భాగంగా 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు.. ఆ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్ భయపడి వంగి వంగి దండలు పెడుతున్నాడు.. నన్ను ఆగం చేయకండి అని వేడుకుంటున్నారు.. ఒక ఉప ఎన్నికకే కేసీఆర్ వణికిపోతున్నారు.. అసలు ప్రజల్లో ఏ ఆదరణ లేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో ఉన్నాయంటేనే కేసీఆర్ ఇంత ఆగం అవుతున్నారంటే.. ఇక, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ బరిలో ఉండబోతోంది అంటే.. కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకుంటారో..? మునుగోడు ప్రజల కాళ్లు పట్టి వేడుకుంటారా? చూడాలని వ్యాఖ్యానించారు. దీంతో, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తుందనే చర్చ సాగుతోంది.
ఇక, అలంపూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గాని ఏం చేశారు అని నిలదీశారు వైఎస్ షర్మిల.. అలంపూరు దళిత ఎమ్మెల్యే.. దళితులకు ఏమైనా మేలు చేశాడా.. మొత్తం కర్నూల్ లొనే ఎక్కువగా ఉంటాడు.. దళిత బంధుకు కూడా కమీషన్లు తీసుకుంటాడంట కదా..? అని ఫైర్ అయ్యారు. ఇసుక మాఫియా అడ్డం పెట్టుకొని కొడుకు దోచుకుంటున్నాడు.. ఎమ్మెల్యే పేరు దళిత బంధు అంట.. కొడుకు పేరు ఏమో ఇసుక మాఫియా బంధు అని.. ఇద్దరికీ కలిపి ఉన్న పేరు కమీషన్ల బంధు అని.. ఎమ్మెల్యే అబ్రహం, ఆయన తనయుడు పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల.. అలంపూరులో బస్సు డిపో నిర్మిస్తామన్నాడు. శక్తి పీఠానికి 100 కోట్లు కేటాయిస్తామన్నాడు.. అలంపూరు నియోజకవర్గానికి కేసీఆర్ ఏమైనా చేశాడా? అని ప్రశ్నించారు..
మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత.. పేద మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి వారి కాల మీద నిలబడేటట్లు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని స్పష్టం చేశారు షర్మిల.. పేద వాడు ఫోన్ చేసిన పది నిమిషాల్లోనే అందుబాటులో 108 పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన మహనీయుడు వైస్సార్.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన రికార్డ్ ముఖ్యమంత్రి వైయస్సార్ అన్నారు. కానీ, కేజీ టూ పీజీ అన్నాడు.. ప్రతి నిరుద్యోగికి 3000 అన్నాడు, డబుల్ బెడ్ రూమ్ అన్నాడుచ 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు.. 8 సంవత్సరాలుగా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు.. ఆర్డీఎస్ కొరకు ఈ ప్రాంత సాగు నీటి కష్టాలు తీర్చాలని అప్పట్లో అడిగిన వెంటనే వైస్సార్ 101 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు.. అయితే, రైతు బంధు 5000 వేసి రైతులను లక్షాధికారులను చేస్తా అన్నాడు.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్టాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే బంగారు తెలంగాణ.. బీర్ల తెలంగాణ.. బార్ల తెలంగాణ.. కేసీఆర్ కుటుంబానికి బంగారు తెలంగాణ అని మండిపడ్డారు వైఎస్ షర్మిల.