వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. తాను పాలేరు నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వారి కోరిక మేరకు తాను పాలేరు నుంచే పోటీ చేయనున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పాలేరు నియోజక వర్గ కార్యకర్తలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫోటో పెట్టుకొని గెలిచారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో…
తెలంగాణలో పాదయాత్రల పరంపర మొదలైంది.. ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తొలి విడత పాదయాత్ర ముగియగా.. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ కూడా పాదయాత్ర చేశారు. ఇప్పుడు మరో మహా పాదయాత్రకు రంగం సిద్ధమైంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. నేటినుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. తండ్రి సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ… చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. 90 నియోజకవర్గాల మీదుగా 400…
వైఎస్ షర్మిల.. గతంలో జగనన్న బాణం. ఇప్పుడు మాత్రం.. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ.. అధికారం లక్ష్యంగా సాగుతున్న పయనం. ఆమె అడుగులు ఎక్కడివరకూ పడతాయి.. లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేక.. చతికిలబడతారా.. అన్నది పక్కన బెడితే.. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ మాత్రం.. వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఒంటరినైపోయానంటూ.. ఆమె వైఎస్ ను తలుచుకోవడం.. చర్చనీయాంశమైంది. ఇక్కడే… ఓ విషయాన్ని చాలామంది ప్రస్తావిస్తున్నారు. జగన్ సైతం వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత.. ఒంటరిగా నిలిచారని..…
ఇందిరా శోభన్ పార్టీ వీడటంపై వైఎస్సార్ టిపి స్పందించింది. ఇందిరా శోభన్ ని నాయకురాలిగా తయారు చేశామని… ఆమె పార్టీని వీడటంతో ఎటువంటి నష్టం లేదని తెలిపారు వైఎస్సార్ టిపి అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి. ఆరు చోట్ల వైఎస్ షర్మిల ఇప్పటి వరకు నిరుద్యోగ దీక్షలు చేశారని..7వ నిరుద్యోగ దీక్ష మంగళవారం మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం లింగాపూర్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు తూడి దేవేందర్ రెడ్డి. హుజురాబాద్ లో ఉప ఎన్నిక కోసమే…
హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు పోటీ చేయాలి అని వైస్సార్ తెలంగాణ పార్టీ తెలిపింది. రాష్ట్రంలో నిరుద్యోగులు వందల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోంది. నోటిఫికేషన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. రేపు, మాపు అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతోంది. యువత ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే.. వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి కేసీఆర్ మెడలు వంచాలని వైస్సార్ తెలంగాణ…
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు… క్రమంగా విమర్శల వాడి పెంచుతున్నారు.. ఇప్పటికే ఇందిరా పార్క్, లోటప్‌పాండ్ లో దీక్షలు చేసిన షర్మిల.. తాజాగా ఖమ్మం వేదికగా నిరుద్యోగ దీక్ష చేశారు.. ఇక, ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పాటించాలని వైఎస్‌ఆర్‌టీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష కార్యక్రమంలో భాగంగా రాబోయే మంగళవారం (27వ తేదీ) ఉమ్మడి నల్గొండ…
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతరు వైఎస్ షర్మిల… మరోవైపు.. వివిధ జిల్లాల అనుచరులు, వైఎస్ అభిమానులతో సమావేశాలు కూడా నిర్వహించారు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీక్షలు కూడా చేశారు. త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరుపై ఓవైపు ప్రచారం జరుగుతున్నా.. సోషల్ మీడియాలో ఖాతాలో అదేపేరుతో దర్శనమిస్తున్నా.. పార్టీ పేరు ప్రకటించే…