కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్ ఆడుతుంది.. అది ఆ పార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం అని దుయ్యబట్టారు సీఎం జగన్. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు.. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని మండిపడ్డారు. నేను కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్న (వైఎస్ వివేకానందరెడ్డి)కు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు.. అయినా చరిత్ర నుంచి వారు పాఠాలు నేర్వేలేదు.. ఇప్పుడు ఆ పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరి (వైఎస్…
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైంది. నేటి(బుధవారం) నుంచి అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది.
ఎన్టీవీతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్ వైఎస్ ఫోటోను ఎలా వాడుకున్నారు.. ఇపుడు ఆ ఫోటో ఎక్కడ ఉందో ప్రజలకు తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ హయాంలో పాలన ఇప్పటి పాలనను ప్రజలు బేరీజు వేస్తున్నారు.
రేపు(గురువారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు.
గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్..! అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ ఆలయ ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రామమందిర దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రతి శుక్రవారం ఈ రైలు హైదరాబాద్ నుండి అయోధ్యకు వెళుతుంది. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు…
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా తనను విశ్వసించినందుకు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కె.సి.వేణుగోపాల్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం అందించేలా.. పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో నమ్మకంగా పని చేస్తానని హామీ ఇస్తున్నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాకూర్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు.
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. ఇదే సమయంలో.. సోమవారం రోజు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు పేర్కొన్నారు.
ఏపీ కాంగ్రెస్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన తరుణంలో ఆ స్థానంలో వైఎస్ షర్మిలను నియమించే అవకాశాలున్నాయని సమాచారం.