ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి.. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు రుద్రరాజు..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ విమర్శించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారని ఆరోపించారు.
వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక కుట్రతో కూడినదని ఆయన వ్యాఖానించారు. ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులు లేరా అని ప్రశ్నించారు.
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను నిజం చేయటానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొన్ని పార్టీల్లో భయం పట్టుకుందని విమర్శించారు. వైసీపీలో 2019కి ముందు రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఎక్కడ ఉంది?, ఇప్పుడు ఎక్కడ పెట్టారు అని ప్రశ్నించారు. వైసీపీ మోసపూరిత వైఖరి నచ్చకనే షర్మిల ఆ పార్టీకి దూరమయ్యారని మస్తాన్ వలీ…
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికి తెలిసిన విషయమే. షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పెద్ద తప్పిదమన్నారు.
రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి ఏపీలో లేదన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వెల్లడించారు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్.. నిన్న తెలంగాణలో కాంగ్రెస్ .. రేపు ఏపీలో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వై నాట్ ఏపీ కాంగ్రెస్ అనేది మా నినాదమని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుంది.. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందన్నారు. షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ, ఎలాంటి సంబంధం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి