YS Sharmila: పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల నియామకం.. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగింది.. త్వరలోనే ఆమెకు పీసీసీ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం సాగింది.. దానికి అనుగుణంగానే వైఎస్ షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం.. వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. ఇదే సమయంలో.. సోమవారం రోజు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు పేర్కొన్నారు.
Read Also: Tenali: టీడీపీ-జనసేన పొత్తు.. తెనాలిలో చిచ్చు..! సీటు ఇవ్వకపోతే రెబల్‌గా బరిలోకి..!
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
కాగా, ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసి.. వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ చేసిన విషయం విదితమే.. మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై వైఎస్ షర్మిలకు మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చారని.. హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నమాట.. గిడుగు రుద్రరాజుతో రాజీనామాతో వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ కాగా.. ఈ రోజు వైఎస్ షర్మిలనకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారిపోయింది.. కానీ, వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రేస్‌లోకి తీసుకొచ్చేందుకు అధిష్ఠానం వ్యూహాలను రచిస్తోంది. దానిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించిందంటున్నారు విశ్లేషకులు.. ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనుల్లో వైఎస్ షర్మిల బిజీగా ఉన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!