CM YS Jagan: కాంగ్రెస్ ది డర్టీ గేమ్.. అప్పుడు మా చిన్నాన్న.. ఇప్పుడు నా సోదరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: కాంగ్రెస్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తిరుపతిలో ఇండియాటుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్ ఆడుతుంది.. అది ఆ పార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు.. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని మండిపడ్డారు. నేను కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్న (వైఎస్ వివేకానందరెడ్డి)కు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు.. అయినా చరిత్ర నుంచి వారు పాఠాలు నేర్వేలేదు.. ఇప్పుడు ఆ పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరి (వైఎస్ షర్మిల)కి ఇచ్చారు.. మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, అధికారం అనేది దేవుడు ఇచ్చేది.. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను.. ఆయనే అన్నీ చూస్తాడు అని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Apple Smartwatch : మరోసారి ట్రేండింగ్ లో యాపిల్ స్మార్ట్ వాచ్.. ఈసారి గాల్లో ఉండగానే..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఇక, పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను అన్నారు సీఎం జగన్.. విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కుకావాలన్న ఆయన.. పేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు.. పేద పిల్లలు కేవలం తెలుగుమీడియంకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు ఇంగ్లిషు మీడియం చదువుతున్నారు.. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలి.. మా రాష్ట్రంలో పేదపిల్లలకు సంపన్నుల పిల్లలకు అందే చదువులు అందాలన్నదే మా లక్ష్యంగా పేర్కొన్నారు. కేవలం మేం స్కూలు విద్యపైనే కాదు, ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం.. ఉద్యోగాలు సాధించే కోర్సులను అందిస్తున్నాం.. ఇంటర్నషిప్ అందిస్తున్నాం.. ఆన్‌లైన్ వర్టికల్స్ అందిస్తున్నాం.. పాఠ్యప్రణాళికలో వీటిని భాగస్వామ్యం చేశాం అని వెల్లడించారు. పిల్లలు ఆన్‌లన్‌లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం.. బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం.. ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం అని తెలిపారు. రాజకీయాలు వేరే.. పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు.. అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టిపెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం అని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!